Entertainment

ఐదు భాషల్లో ఒకేసారి రిలీజ్..హీరో  నవీన్ చంద్ర సంచలనం


సినిమా పరిశ్రమలో ఎలాంటి నటుడు అయినా సరే  వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే హీరో నవీన్ చంద్రలా అవ్వచ్చు. తమిళ మూవీ  జిగర్తాండ డబుల్ ఎక్స్ లో  సూపర్ గా నటించి ఇప్పుడు బహు బాషా నటుడుగా ముందుకు దూసుకుపోతున్నాడు.లేటెస్ట్ గా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

నవీన్ చంద్ర హీరోగా ఇన్స్ పెక్టర్ రిషి అనే ఒక వెబ్ సిరీస్ తెరకెక్కింది.క్రైమ్ అండ్  హర్రర్ ఎలిమెంట్స్ తో ఆ మూవీ   రూపుదిద్దుకుంది. ఎటువంటి  క్లూ లేకుండా వరుసగా కొన్ని హత్యలు జరుగుతుంటాయి. వాటిని ఎవరు చేసారో కనిపెట్టే ఒక  పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రని  నవీన్ చంద్ర పోషించాడు.ఇన్స్ పెక్టర్ రిషి ఒరిజినల్ గా తమిళంలో నిర్మాణం జరుపుకుంది. ఇప్పుడు తమిళంతో పాటు తెలుగు, హిందీ,మలయాళ,కన్నడ భాషల్లో కూడా  విడుదల కాబోతుంది. ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

 

జె.ఎస్. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ పై  సుఖ్ దేవ్ లాహిరి నిర్మాతగా వ్యవహరించగా నందిని దర్శకత్వం వహించింది. సునైన, కన్నా రవి, మాలిని జీవరత్నం, శ్రీకాంత్ దయాల్, కుమార్ వేల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  నవీన్ చంద్ర ఖాతాలో  ఏలెవన్, సత్యభామ వంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి.


 



Source link

Related posts

chinmayi sripada comments wiral social media

Oknews

Hero in nikhila vimal working in corona call center

Oknews

వైసీపీని ఉలిక్కిపడేలా చేస్తున్న సినిమా.. లోకేష్ డైరెక్షన్!

Oknews

Leave a Comment