Entertainment

‘ఐరనే వంచాలా ఏంటి?’ ట్రెండ్‌ అవుతున్న ‘ఫ్యామిలీస్టార్‌’ డైలాగ్‌


విజయ్‌ దేవరకొండ, పరశురామ్‌ కాంబినేషన్‌లో దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్‌ విడుదలైంది. ఇందులోని  ఓ డైలాగ్‌ ట్రెండిరగ్‌ జరుగుతోంది. ‘ఐరనే వంచాలా ఏంటి’ అని విలన్‌ని ఉద్దేశించి విజయ్‌ చెప్పే డైలాగ్‌కి ‘మిర్చి’లోని ప్రభాస్‌ డైలాగ్‌ ‘నా ఫ్యామిలీ సేఫ్‌’ అనే డైలాగ్‌ను సింక్‌ చేస్తున్నారు.  ఫ్యామిలీస్టార్‌ గ్లింప్స్‌ విడుదలైన తర్వాత అది స్టీల్‌ కంపెనీ యాడ్‌లా ఉంది తప్ప సినిమా టీజర్‌లా లేదని చాలా మంది కామెంట్స్‌ పెట్టారు. ఆ వీడియోను విజయ్‌ తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టాడు. దాంతో మళ్ళీ ఆ వీడియో ట్రెండిరగ్‌ అవుతోంది. ఎంతో సీరియస్‌గా విజయ్‌ చెప్పిన ఈ డైలాగ్‌ కామెడీగా మారిపోయింది. అంతేకాదు, ఈ సినిమా మృణాల్‌ లుక్‌ గురించి కూడా కామెంట్స్‌ వస్తున్నాయి. సర్కారు వారి పాటలో కీర్తి సురేష్‌ను తలపించేలా మృణాల్‌ ఉందని అంటున్నారు. 

విజయ్‌ గత చిత్రం లైగర్‌ అందర్నీ నిరాశ పరిచిన విషయం తెలిసిందే. అలాగే మహేష్‌ హీరోగా పరశురామ్‌ చేసిన సర్కారు వారి పాట ఆశించినంత విజయం సాధించలేదు. ‘గీత గోవిందం’ తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‌’ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే దిల్‌రాజు ఈ సినిమాను ఎంతో లావిష్‌గా చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక గ్లింప్‌తోనే సోషల్‌ మీడియాలో ట్రెండిరగ్‌లోకి వచ్చిన విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్‌’తో మరో సూపర్‌హిట్‌ తన ఖాతాలో వేసుకుంటాడని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 



Source link

Related posts

నా ప్రేక్షకుల ఆనందం కోసమే.. అలాంటి సీన్స్‌ చేశాను!

Oknews

సిద్ధార్థ్ ‘చిన్నా’ మూవీ రివ్యూ.. తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన సినిమా

Oknews

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పై చిరంజీవి సినిమాలు

Oknews

Leave a Comment