దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతీ ఒక్కరు ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆహారాన్ని తీసుకుంటూ, తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యాయామం అనేది తప్పనిసరి. నిత్యం వ్యాయామం చేయడం వలన ఆరోగ్యంగానే కాకుండా, యవ్వనంగా కూడా ఉండొచ్చునంట.
మనిషి శరీరానికి గాలి నీరు, ఆహారం ఎంత అవసరమో వ్యాయమం కూడా అంతే అవసరం. రోజూ శారీరక శ్రమ చేయడం ద్వారా రక్తపోటు తగ్గించుకోవచ్చు. అయితే ప్రస్తుతం చాలా మంది రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు, దాని నుంచి బయటపడటానికి ఎక్సర్‌సైజ్ చేయాలంట.
ఓ సర్వేలో షాకింగ్ విషయాలు వెళ్లడి అయ్యాయి. వ్యాయామం రక్తపోటును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. 16000 మంది వ్యక్తులతో కలిసి చేసిన 270 స్టడీస్‌లో వ్యాయామం అధిక రక్తపోటును తగ్గిస్తుందనే విషయం వెళ్లడైనట్లు ఇంగ్లాండ్‌లోని కాంటర్‌బరీ క్రైస్ట్ చర్చ్ యూనివర్శిటీలో జిమ్ వైల్స్, PhD డైరెక్టర్ చెప్పారు.
పరిశధనల్లో ఐసోమెట్రిక్ వ్యాయామం, సిస్టోలిక్ రక్తపోటు8.24 mm Hg డయాస్టొలిక్ రక్తపోటును తగ్గించిందని కనుగొన్నారు. అలాగే 2.5 mm Hg ద్వారా ఐసోమెట్రిక్ వ్యాయామం ఏరోబిక్ వ్యాయామం (4.49 నుంచి 2.53 తగ్గగా), రెసిస్టెన్స్ ట్రైనింగ్ (4.55, 3.04 ), విరామ సమయం (4.08, 2.5 తగ్గుదల) కంటే అధిక రక్తపోటు ప్రయోజనాలను అందించింది.
పరిశోధకులు మాట్లాడుతూ.. మేము ప్రపంచ వ్యాప్తంగా చేసిన పరిశోధనల్లో రక్తపోటును తగ్గించడానికి , సామార్థ్యాన్ని పెంచడంలో ఐసొమెట్రిక్ వ్యాయామం కీలక పాత్ర పోషించినది అని తెలిపారు.
Researchers have found that one type of exercise – and one single exercise in particular – helps lower blood pressure especially well. https://t.co/CsBrT41vuI pic.twitter.com/KJ6O7JTT9q
— WebMD (@WebMD) January 31, 2024