కూట‌మి రాజ‌కీయాలు, మ‌రోవైపు చంద్ర‌బాబు డబ్బుకే ప్రాధాన్య‌త‌ను ఇచ్చారంటూ తెలుగుదేశం నేత‌లే నెత్తినోరు మోదుకొంటూ ఉండ‌టం.. ఫ‌లితంగా ఈ ఎన్నిక‌ల్లో టీడీపీకి రెబెల్స్ పోటు గ‌ట్టిగా ఉంటుంద‌ని స్ప‌ష్టం అవుతోంది. ఒక‌వైపు నామినేష‌న్ల‌కు స‌మ‌యం ఆస‌న్నం అవుతూ ఉంది. ఇలాంటి నేప‌థ్యంలో ప‌లువురు మాజీ ఎమ్మెల్యేలు, ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల ఇన్ చార్జిలు త‌మ ప్ర‌య‌త్నాల్లో తామున్నారు. వారిలో కొంద‌రు ఇంకా లాబీయింగ్ ను కొన‌సాగిస్తూ ఉంటే, ఇంకొంద‌రు మాత్రం.. ఇండిపెండెంట్ గా బ‌రిలో నిల‌వ‌డ‌మే అని స్ప‌ష్టం చేస్తున్నారు.
చాలా జిల్లాల్లో ఇలాంటి ప‌రిస్థితే ఉన్నా.. అల్లూరి జిల్లాలో ఏకంగా ముగ్గురు రెబెల్ సైర‌న్ మోగిస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం. ఆరేడు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని ఈ జిల్లాలో ఏకంగా మూడు చోట్ల మాజీ లు, మాజీ ఇన్ చార్జిలు తిరుగుబావుట ఎగ‌రేస్తున్నారు.
అల్లూరి జిల్లా ప‌రిధిలో పాడేరులో ఒక‌ప్ప‌టి ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రికి చంద్ర‌బాబు నాయుడు హ్యాండిచ్చారు. అమెను కాద‌ని వేరే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు చంద్ర‌బాబు నాయుడు. ఆమె త‌న అనుచ‌ర‌వ‌ర్గంతో స‌మావేశాల‌ను కొన‌సాగిస్తూ.. ఇండిపెండెంట్ గా నామినేష‌న్ కు రెడీ అవుతున్నారు. ఇక రంప‌చోడ‌వ‌రంలో 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున గెలిచిన వంత‌ల రాజేశ్వ‌రి ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. ఫిరాయింపు కృతజ్ఞ‌త‌ను కూడా చంద్ర‌బాబు నాయుడు చూప‌డం లేదు ఆమె మీద కూడా! దీంతో ఆమె కూడా ఇండిపెండెంట్ గా బ‌రిలో ఉండేలా ఉన్నారు.
అర‌కు విష‌యంలో అయితే దొన్నుదొర‌ను ముందుగా అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించి, తీరా అస‌లైన స‌మ‌యంలో చంద్రబాబు హ్యాండిచ్చారు. పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీ పోటీకి అంటూ కేటాయించారు. దీంతో దొన్నుదొర ఇండిపెండెంట్ గా బ‌రిలోకి దిగే అవకాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.
ఇలా అల్లూరి జిల్లాలో ఏకంగా ముగ్గురు రెబెల్స్ త‌యార‌వుతున్న‌ట్టుగా ఉంది కూట‌మికి వ్య‌తిరేకంగా. అయితే ఇది కేవ‌లం ఈ జిల్లాకు ప‌రిమితం అయిన ప‌రిస్థితి కాదు, ఈ జాబితాలో చాలా నియోజ‌క‌వ‌ర్గాలు నిలిచేలా ఉన్నాయి.