Health Care

ఒకే వ్యక్తిని 172 సార్లు కరిచిన పాము!.. అయినా బతికేశాడు!!


దిశ, ఫీచర్స్ : విషపూరితమైన పాము ఒక్కసారి కాటు వేస్తేనే బతకడం కష్టం. అలాంటిది ఓ వ్యక్తికి మాత్రం 172 సార్లు విష సర్పం కరిచినా ఏమీ కాలేదంటే మీరు నమ్ముతారా?.. కానీ ఇది నిజం. పైగా అమెరికాకు చెందిన ఆ వ్యక్తి నిండు నూరేళ్లు బతికాడు. ప్రముఖ స్నేక్ ఇన్ఫర్మేషన్ వెబ్‌సైట్ (http://www.billhaast.com) ప్రకారం.. అమెరికాకు చెందిన బిల్ హాస్ట్ అనే వ్యక్తికి చిన్నప్పటి నుంచి పాములంటే చాలా ఇంట్రెస్ట్. ఇతని అసలు పేరు ఎడ్వర్డ్ హాస్ట్, 1910లో డిసెంబర్ 30న న్యూజెర్సీలోని ప్యాటర్సన్‌లో జన్మించాడు. తనకు ఏండేండ్ల వయస్సు ఉన్నప్పుడు మొదటిసారిగా ఓ పామును పట్టుకున్నాడు. ఆ తర్వాత అతనికి వాటిపై మరింత ఆసక్తి పెరిగింది. దీంతో హైస్కూల్ చదువును మధ్యలోనే వదిలేసి పాములను పట్టుకోవడమే పనిగా పెట్టుకున్నాడు.

రూరల్ ఏరియాలకు వెళ్లి పాములను వెంటాడుతూ వాటిని పట్టుకోవడమే వృత్తిగా మార్చుకున్నాడు బిల్ హాస్ట్. పైగా తను పట్టుకున్న పాములతో చిన్న చిన్నగా కాటు వేయించుకునేవాడట. కొంత పరిస్థితి విషమించినట్లు అనిపించినప్పటికీ, ఎలాంటి చికిత్స లేకుండానే ఆ తర్వాత కోలుకునే వాడు. ఒకసారి అయితే బిల్ హాస్ట్ పాము విషాన్ని స్వయంగా శరీరంలో ఇంజెక్ట్ చేసుకున్నాడని చెప్తారు. ఈ క్రమంలో అతని శరీరంలో యాంటీ వీనమ్ రోగ నిరోధక శక్తి డెవలప్ అయ్యిందని, అందుకే అతనికి పాము విషం ఎక్కదని చెప్తారు. ఒకసారి బిల్ హాస్ట్ అత్యంత విషపూరితమైన పాముతో కావాలనే 172 సార్లు కాటు వేయించుకున్నాడట. అయినా అతను చనిపోలేదు.

పాములపట్ల గల ఆసక్తి బిల్ హాస్ట్‌ను పాము కాటుకు వ్యతిరేకంగా ముడి విషాన్ని ఉత్పత్తి చేసే ఆలోచనలవైపు ప్రేరేపించింది. దీంతో అతను ఫ్లోరిడాలో ‘మియామి సెర్ప్‌టేరియం’ అనే ఓ మ్యూజియాన్ని నిర్మించాడు. ఇందులో విషపూరితమైన పాములను పెంచుతూ.. వాటి నుంచి ముడి విషాన్ని సేకరిస్తూ పాము కాటుకు విరుగుడు మందు తయారు చేసే ఫార్మా స్యూటికల్ కంపెనీలకు అమ్మడమే వ్యాపారంగా కొనసాగించాడు.

అలా 1990 వరకు ప్రతి ఏటా 36 వేల పాయిజన్ శాంపిల్స్‌ను పలు కంపెనీలకు అందజేశాడు బిల్ హాస్ట్. విషయం ఏంటంటే.. పాములను తన చేత్తో పట్టుకొని విషాన్ని తీసేవాడట. 1954లో అతను అత్యంత విషపూరితమైన నీలి రంగు పాము కాటుకు గురయ్యాడు. నిజానికి ఇది కరిస్తే ఎవరూ బతకరు. కానీ బిల్ హాస్టన్ మాత్రం బతికాడు. విచిత్రం ఏంటంటే.. ఇతన్ని కాటు వేసిన 10 రోజుల తర్వాత ఆ నీలిరంగు విషపూరిత పాము చనిపోయింది. చివరికి బిల్ హాస్ట్ 2011లో సహజ మరణం పొందాడు. అప్పట్లో అతనిని ‘స్నేక్ మ్యాన్’ అని కూడా పిలిచేవారు.



Source link

Related posts

మహిళలే త్వరగా ముసలి వాళ్ళు ఎందుకు అవుతారు.. సర్వేలు ఏం చెబుతున్నాయంటే?

Oknews

అమ్మాయిలు, అబ్బాయిల్లో ముద్దంటే ఎవరికి ఎక్కువ ఇష్టమో తెలుసా?

Oknews

దట్టమైన అడవుల్లో దొరికే ఈ చీమల ఫ్రై గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు! ఈ సమస్యలు ఇట్టే మాయం!

Oknews

Leave a Comment