Health Care

ఒక్కసారి ఈ హిల్ స్టేషన్‌లను సందర్శించారంటే.. మనాలి – డల్హౌసీని కూడా మర్చిపోవాల్సిందే..


దిశ, ఫీచర్స్ : మార్చి – ఏప్రిల్ రాకతో భారతదేశంలో వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఈ వేసవి సీజన్‌లో భానుడు భగ భగ లాడడం ప్రారంభిస్తారు. ఇక మరోవైపు స్కూల్, కాలేజీ విద్యార్థుల పరీక్షలు కూడా ముగుస్తాయి. దీంతో చాలామంది ప్రజలు టూర్లు వేయడానికి ప్రణాళికలు కూడా వేసుకుంటారు. అయితే ఈ నెలల్లో వేడి పెరుగుతుండడంతో ప్రజలు చల్లగా ఉండే హిల్ స్టేషన్‌కు వెళ్లాలని అనుకుంటారు. కొంతమంది అయితే ఉత్తరాఖండ్ లేదా హిమాచల్‌ను సందర్శించాలని ప్లాన్ చేసుకుంటారు.

కానీ ఆయా ప్రదేశాల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో గంటల తరబడి ట్రాఫిక్‌లో గడపాల్సి వస్తోంది. ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడికి రావడంతో ఇక్కడి హోటళ్లు కూడా నిండిపోయి కిటకిటలాడుతూ ఉంటాయి. ఏప్రిల్ నెలలో మీరు టూర్ వేసుకుంటే ఈ రెండు ప్రదేశాలకు బదులుగా ఇలాంటి మరికొన్ని మంచి ప్రదేశాలకు వెళ్లవచ్చు. మరి ఆ ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పంచమర్హి..

మీరు రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండాలనుకుంటున్నారా అయితే మధ్యప్రదేశ్‌లోని ఏకైక హిల్ స్టేషన్ పంచమర్హిని సందర్శించేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో, ఎత్తైన సాత్పురా కొండల పై ఉన్న పంచమర్హిని ఉంది. ఇక్కడికి రావడం వల్ల ప్రకృతికి దగ్గరగా ఉన్న అనుభూతి కలుగుతుంది. అంతే కాదు ఇక్కడ జలపాతాలు, గుహలను కూడా చూడవచ్చు.

మేఘాలయ..

మీరు వేరే ప్రదేశాన్ని అన్వేషించాలనుకుంటే మేఘాలయను కూడా సందర్శించవచ్చు. ఏప్రిల్‌లో ఇక్కడ ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది. ప్రకృతి, సాహస ప్రియులకు ఈ ప్రదేశం స్వర్గం కంటే తక్కువేం కాదు. ఇక్కడ జలపాతాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ మీరు ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు.

ఊటీ..

తమిళనాడులోని ఊటీ హనీమూన్ స్పాట్ మాత్రమే కాదు. మీరు, కుటుంబం, స్నేహితులతో కూడా ఇక్కడకు వెళ్లవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఏప్రిల్‌లో ఊటీలో పర్యాటకుల తాకిడి అధికంగానే ఉంటుంది. ఇక్కడికి వచ్చినట్టయితే దొడ్డబొట్ట శిఖరం, టైగర్ హిల్స్‌ని చూడడం మాత్రం అస్సలు మిస్ చేయకండి. అలాగే మీకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉంటే, ఖచ్చితంగా టీ తోటల ఫోటోలు తీసుకోండి. ఇది మీ యాత్రను కూడా గుర్తుండిపోయేలా చేస్తుంది.



Source link

Related posts

gold,business:బంగారం కొనుగోలు చేసేటప్పుడు మోసపోతామేమో అని భయపడుతున్నారా.. మీ కోసమే ఈ చిట్కా

Oknews

ముహూర్తాలతో పనేముంది?.. అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ పెళ్లే నిదర్శనం!

Oknews

ఉదయాన్నే లేచి ఆ పనిచేసే అలవాటు.. బెనిఫిట్స్ తెలిస్తే మీరు కూడా..

Oknews

Leave a Comment