దర్శకుడు పూరి జగన్నాధ్ తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసి అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్న నటుడు సాయిరాం శంకర్. కెరీర్ మొదట్లో మంచి హిట్ సినిమాల్లోనే నటించాడు. కానీ ఆ తర్వాత చేసిన చాలా చిత్రాలు పరాజయాల బాటలోకి వెళ్లాయి.ఇప్పుడు ఒక పథకం ప్రకారం అంటు ముందుకు వస్తున్నాడు. ఆ విషయాలేంటో ఒకసారి చూద్దాం.
సాయిరాం శంకర్ హీరోగా ఒక పథకం ప్రకారం అనే మూవీ తెరకెక్కుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయిరాం ఒక పవర్ ఫుల్ అడ్వకేట్ పాత్రలో నటిస్తున్నాడు. మార్చిలో విడుదల అవ్వడానికి ముస్తాబవుతున్న ఈ మూవీలో వర్సటైల్ యాక్టర్ సముద్ర ఖని ఒక పోలీసు ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల్ని అందుకున్న వినోద్ విజయ్ దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటుంది. పైగా గార్లపాటి రమేష్ తో కలిసి నిర్మాతగా కూడా ఆయన వ్యవహరిస్తున్నాడు.
ఆసిమా నర్వాల్,శృతి సోదిలు హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆయన అందించిన పాటలు అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా సినిమాల విజయంలో ప్రముఖ పాత్ర పోషించాయి. ఇప్పటికే విడుదలైన ఓ సారి ఇలా రా అనే పాట జనాల నోళ్ళల్లో నానుతు ఉంది. అలాగే ఈ మూవీకి ఐదుగురు నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ వర్క్ చేస్తుండం విశేషం. ఆర్ట్ డైరెక్టర్ గా సంతోష్ రామన్, కెమెరా మెన్ గా రాజీవ్ రవి, మేకప్ పట్టణం రషీద్, సౌండ్ డిజైనర్ గా రాధాకృషన్ లాంటి జాతీయ అవార్డు ని అందుకున్న సూపర్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. డైరెక్టర్ వినోద్ విజయ్ కూడా జాతీయ అవార్డు ని అందుకున్నాడు.