EntertainmentLatest News

‘ఒడవుమ్ ముడియాద్ ఒలియవుమ్ ముడియాద్’ మూవీ రివ్యూ 


సినిమా పేరు: ఒడవుమ్ ముడియాద్ ఒలియవుమ్ ముడియాద్ 

నటీనటులు : సత్యమూర్తి. వి, గోపి అరవింద్, సుధాకర్ జయరామన్ తదితరులు

రచన: కిషోర్ కె కుమార్

ఎడిటింగ్: గణేశ్ శివ

మ్యూజిక్: కౌశిక్ క్రిష్

సినిమాటోగ్రఫీ: జోషువా జె పెరెజ్

నిర్మాతలు: రాజన్

దర్శకత్వం: రమేశ్ వెంకట్

ఓటీటీ : ప్రైమ్ వీడియో

కొన్ని ఇతర భాషా చిత్రాలు తెలుగులో హిట్ అవుతుంటాయి, మరికొన్ని ప్లాప్ అవుతుంటాయి. అయితే కొత్త కథని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. తాజాగా ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన ‘ఒడవుమ్ ముడియాద్ ఒలియవుమ్ ముడియాద్’ మూవీ కథేంటో ఓసారి చూసేద్దాం..

కథ:

ఓ ఐదుగురు స్నేహితులు కలిసి సిటీకి వస్తారు. సినిమాల మీద ఆసక్తితో ఓ రూమ్ తీసుకొని సరైన అవకాశం కోసం సినిమా ప్రొడ్యూసర్ ల చుట్టూ తిరుగుతుంటారు. ఇక వాళ్ళ దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయి ఊరికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయి బస్ స్టాండ్ కి వెళ్తారు. అక్కడ ఒక్క బస్ కూడా ఉండదు. ఏంటా అని ఆరా తీస్తే సిటీ అంతా ధర్నా జరుగుతుందని తెల్లారే దాకా ఒక్క బస్సు కూడా వెళ్ళదని తెలుసుకుంటారు. ఇక వేరే దారిలేక వాళ్ళ రూమ్ కి వెళ్తుంటో దారిలో ఓ థియేటర్ కన్పిస్తుంది. అది బి గ్రేడ్ సినిమాలు ఆడే ఓ పాతపడ్డ థియేటర్. దాంతో వారంతా కలిసి సినిమా చూడటానికి లోపలికి వెళ్తారు. వారితో పాటు మరికొంతమంది ఆ సినిమా చూడటానికి లోపలికి వెళ్తారు. ఆ తర్వాతి ఏం జరిగిందనేది మిగతా కథ..

విశ్లేషణ:

మొదటగా థియేటర్ లోకి ఓ వయసున్న వ్యక్తి రావడం.. భయంతో బయటకు వెళ్ళాలని చూసినా గేటు దాటి బయటకు రాలేకపోవడంతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. ఇక ఫస్టాఫ్ లో హారర్ ఎలిమెంట్స్ తో బాగానే సాగుతుంది. అయితే సెకండాఫ్ మొదలవ్వగానే ఫస్టాఫ్ లో జరిగిందే మళ్లీ జరుగుతుందా అనేలా సీన్స్ ఉంటాయి.

ఆ థియేటర్ లో ఏం ఉందా అనే క్యూరియాసిటితో కథ మొదలైనా ఆ ఇంటెన్స్ ని చివరిదాకా మెయింటైన్ చేయలేకపోయారు. ఆయితే ఒకానొక దశలో దెయ్యాలు కూడా మాములు మనుషులలాగా కన్పించడంతో ఏదీ ఇంట్రెస్ట్ గా ఉండదు. రొమాంటిక్ సీన్స్ ఏమీ లేవు. హారర్ చిత్రమని చెప్పి కామెడీ సినిమా తీసారేంట్రా బాబు అని ప్రేక్షకుడికి అనిపిస్తుంది. తొంభై లో జరిగిన ఓ సంఘటనకి ప్రస్తుతం జరిగే సీన్స్ జోడించడం అవి పెద్దగా ఇంపాక్ట్ కలిగించకపోగా.. లెంత్ కోసం సీన్లని యాడ్ చేసినట్టుగా అనిపిస్తుంది.

సినిమాలో ఏదైనా బాగుందా అంటే అది.. మొదటి ఇరవై నిమిషాల్లో వచ్చే సీన్స్ మాత్రమే. ఇక మిగతాదంతా అవసరం లేని కంటెంట్.. ఏదీ సీరియస్ గా సాగదు. కథనం మరచి చిత్ర, విచిత్ర పాత్రలు స్క్రీన్ మీదకు వస్తూనే ఉంటాయి. సరే పోనీ ఏదో ఒకటి అని చూద్దామని అనుకున్నా సినిమాటోగ్రఫీ అంతంతా మాత్రమే ఉంది.  జోషువా జె పెరెజ్ సినిమాటోగ్రఫీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. గణేశ్ శివ ఎడిటింగ్ లో కాస్త జాగ్రత్త వహించాల్సింది. కౌశిక్ క్రిష్ మ్యూజిక్ ఓకే. నిర్మాణ విలువలు పర్వాలేదు. అడల్ట్ సీన్స్ ఏమీ లేకపోయినా.. మూవీలో ఎంటర్‌టైన్మెంట్ మిస్ అయి బోరింగ్ వచ్చేస్తుంది. ల్యాగ్ అండ్ లెంతీ సీన్స్ తో విసుగెత్తించేశారు మేకర్స్.

నటీనటుల పనితీరు:

సత్యమూర్తి నటన బాగుంది. గోపీ అరవింద్, సుధాకర్ జయరామన్ తో పాటు మిగతా పాత్రలు వారి పాత్రల పరిధి మేర నటించారు.

ఫైనల్ గా..  

హరర్ ఎలిమెంట్స్ లేని ఈ హరర్ సినిమా చూడటం కాస్త కష్టమే.

రేటింగ్: 2/5

✍️. దాసరి మల్లేశ్



Source link

Related posts

మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా సునీతా మహేందర్ రెడ్డి

Oknews

Pawan kalyan Powerful Speech At Tadepalligudem పవన్ అంటే జగన్ ను నట్టేట ముంచే తుఫాను

Oknews

Using Feedly AI to sort technical updates from news commentary during the SolarWinds attack: A case study

Oknews

Leave a Comment