EntertainmentLatest News

‘ఓం భీమ్ బుష్’ మూవీ రివ్యూ


సినిమా పేరు: ఓం భీమ్ బుష్

తారాగణం: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగర్, ఆదిత్య మీనన్, ర‌చ్చ‌ర‌వి తదితరులు

సంగీతం: స‌న్నీ ఎంఆర్

డీఓపీ: రాజ్ తోట

ఆర్ట్: శ్రీ‌కాంత్ రామిశెట్టి

ఎడిటర్: విజయ్ వర్ధన్ కావూరి

రచన, దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి

నిర్మాత: సునీల్ బలుసు

బ్యానర్: వి సెల్యులాయిడ్స్

విడుదల తేదీ: మార్చి 22, 2024

గతేడాది ‘సామజవరగమన’ చిత్రంతో నవ్వులు పూయించి ఘన విజయాన్ని అందుకున్న శ్రీవిష్ణు.. ఈ ఏడాది ‘ఓం భీమ్ బుష్’ అనే మరో కామెడీ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసారి శ్రీవిష్ణుకి ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా తోడయ్యారు. గతంలో ఈ త్రయం నటించిన ‘బ్రోచేవారెవరురా’ మెప్పించింది. దాంతో ‘ఓం భీమ్ బుష్’ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. మరి ‘నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్’ అంటూ నవ్వించడమే లక్ష్యంగా రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది? శ్రీవిష్ణుకి మరో విజయాన్ని అందించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

క్రిష్(శ్రీవిష్ణు), వినయ్(ప్రియదర్శి), మాధవ్(రాహుల్ రామకృష్ణ) ముగ్గురు స్నేహితులు. Ph.D కోసమంటూ కాలేజ్ లో చేరి, ‘బ్యాంగ్ బ్రదర్స్’ పేరుతో వీరు చేయని చేష్టలు ఉండవు. వీళ్ళ టార్చర్ భరించలేక ప్రొఫెసర్(శ్రీకాంత్ అయ్యంగర్) డాక్టరేట్ లు ఇచ్చి మరీ వాళ్ళని వదిలించుకుంటాడు. జీవితంలో ఓ లక్ష్యం అంటూ లేని బ్యాంగ్ బ్రదర్స్.. అనుకోకుండా భైరవపురం అనే గ్రామానికి వస్తారు. అక్కడ ఒక బృందం క్షుద్రపూజలు చేస్తూ.. గుప్తనిధులు కనిపెట్టడం, దెయ్యాలను వదిలించడం వంటివి చేసి బాగా డబ్బులు సంపాదిస్తుంటుంది. దీంతో బ్యాంగ్ బ్రదర్స్ కూడా టెక్నాలజీని ఉపయోగిస్తూ అదే బాటలో పయనించాలి అనుకుంటారు. ఊరి ప్రజలకు తమని తాము సైంటిస్ట్ లుగా పరిచయం చేసుకొని, A to Z సర్వీసెస్ ను ప్రారంభిస్తారు. తక్కువ సమయంలోనే అందరినీ మాయ చేసి ఊరి ప్రజల దృష్టిలో హీరోలు అవుతారు. ఇలా సాఫీగా సాగిపోతున్న వారి జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. ఊరి చివర ఉన్న సంపంగి మహల్ లోకి వెళ్లి నిధి తీసుకురావాలనే ఛాలెంజ్ ఎదురవుతుంది. ఆ సంపంగి మహల్ పేరు వింటేనే ఊరి ప్రజలు ప్రాణ భయంతో వణికిపోతారు. ఎందుకంటే అక్కడ సంపంగి అనే దెయ్యం ఉంటుంది. ఆ మహల్ లోకి వెళ్లిన వారెవరూ ప్రాణాలతో తిరిగిరారు. అలాంటి సంపంగి మహల్ లోకి బ్యాంగ్ బ్రదర్స్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వారు నిధిని కనిపెట్టగలిగారా? వారిని సంపంగి దెయ్యం ప్రాణాలతో విడిచిపెట్టిందా? అసలు సంపంగి కథ ఏంటి? అనేవి సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

కథగా చూసుకుంటే ‘ఓం భీమ్ బుష్’ స్టోరీ చిన్నది, తెలిసినదే. అయితే ‘నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్’ అనే క్యాప్షన్ కి తగ్గట్టుగానే.. లాజిక్స్ ని పక్కన పెట్టి చూస్తే కామెడీతో బాగానే మ్యాజిక్ వర్కౌట్ అయింది. ఓ రకంగా ఇది ‘జాతిరత్నాలు’ తరహా ముగ్గురు స్నేహితుల కథ. అందులో జాతిరత్నాలు అనుకోకుండా ఒక క్రైమ్ లో ఇరుక్కుంటే.. ఇందులో బ్యాంగ్ బ్రదర్స్ దెయ్యం ఉన్న మహల్ లోకి వెళ్తారు.

ప్రారంభ సన్నివేశాలు కాస్త నెమ్మదిగా ఉంటాయి. కాలేజ్ లో బ్యాంగ్ బ్రదర్స్ పంచే వినోదం ఆశించిన స్థాయిలో ఉండదు. అయితే భైరవపురం వెళ్లి, A to Z సర్వీసెస్ ప్రారంభించాక కామెడీ డోస్ పెరుగుతుంది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పోటాపోటీగా నవ్వులు పంచుతారు. ముఖ్యంగా సర్పంచ్ ఇంట్లో ఈ ముగ్గురు చేసే హంగామా కడుపుబ్బా నవ్విస్తుంది. ఇంటర్వెల్ కూడా మెప్పిస్తుంది. సెకండాఫ్ పై ఆసక్తి కలిగేలా చేస్తుంది. 

ఇక సెకండాఫ్ అంతా సంపంగి మహల్ లోనే ఉంటుంది. మహల్ లో బ్యాంగ్ బ్రదర్స్ కి ఎదురయ్యే అనుభవాలు థ్రిల్ తో పాటు కామెడీని పంచుతాయి. ముఖ్యంగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణకు సంపంగి దెయ్యం ఎదురయ్యే సన్నివేశాలు తెగ నవ్విస్తాయి. సెకండాఫ్ లో వచ్చే రెండు ట్విస్ట్ లు సాధారణ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే కొన్ని సీన్స్ రిపీటెడ్ గా అనిపిస్తాయి. పతాక సన్నివేశాలు మెప్పించాయి. చివరిలో ఇచ్చిన సందేశం బాగుంది. కానీ అప్పటిదాకా బాగా నవ్వించి, చివరిలో కామెడీ డోస్ తగ్గడం ప్రేక్షకులకు కాస్త నిరాశ కలిగించే అంశం. 

మొత్తానికి నవ్వించమే టార్గెట్ గా రూపొందిన ఈ సినిమా.. ఆ విషయంలో చాలా వరకు సక్సెస్ అయింది. అయితే అక్కడక్కడా వచ్చే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్ లు, ఒకట్రెండు సన్నివేశాల కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ కాస్త ఇబ్బందిపడే అవకాశముంది.

రచన, దర్శకత్వంలో శ్రీ హర్ష కొనుగంటి తన మార్క్ చూపించాడు. వినోదంతో పాటు ప్రేక్షకులకు అక్కడక్కడా థ్రిల్ కూడా పంచాడు. స‌న్నీ ఎంఆర్ స్వరపరిచిన పాటలు అంతగా ఆకట్టుకోలేదు. సంగీతం, చిత్రీకరణ ఒకే తరహాలో ఉన్న ‘బ్యాంగ్ బ్రోస్’, ‘దిల్ ధడ్కే’ పాటలు తేలిపోయాయి. పంటి కింద రాళ్ళలా కామెడీ ఫ్లోకి అడ్డుపడేలా ఉన్నాయి. పెళ్లి పాట బాగానే ఉంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. రాజ్ తోట కెమెరా పనితనం మెప్పించింది. మహల్ సన్నివేశాల్లో ఆయన ప్రతిభ కనపడింది. శ్రీ‌కాంత్ రామిశెట్టి ఆర్ట్ వర్క్ బాగుంది. విజయ్ వర్ధన్ కావూరి ఎడిటింగ్ నీట్ గా ఉంది. అయితే కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసినట్లయితే అవుట్ పుట్ ఇంకా మెరుగ్గా ఉండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

నటీనటుల పనితీరు:

శ్రీవిష్ణు మరోసారి తన కామెడీ టైమింగ్ తో మ్యాజిక్ చేశాడు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా పోటాపోటీగా నవ్వులు పంచారు. వీళ్ళ కామెడీనే సినిమాకి హైలైట్ గా నిలిచింది. వన్ లైనర్స్ తో థియేటర్లలో నవ్వులు పూయించారు. ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగర్, ఆదిత్య మీనన్, ర‌చ్చ‌ర‌వి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఫైనల్ గా…

లాజిక్స్ ని పక్కన పెట్టి, కాసేపు హాయిగా నవ్వుకోవాలి అనుకునేవాళ్లు ఈ సినిమాకి హ్యాపీగా వెళ్లొచ్చు.

రేటింగ్: 2.75/5

-గంగసాని



Source link

Related posts

తండ్రికి షాక్‌ ఇచ్చిన కూతురు.. రజినీ కెరీర్‌లోనే ఇది ఫస్ట్ టైమ్!

Oknews

Chief Minister Revanth Reddy Reviews Over Panchayat Raj Department In Telangana Secretariat | Revanth Reddy: ఊరిలో ఆ నిర్వహణ ఇక పంచాయతీలకే, కోటి నిధులు

Oknews

Telugu News From Andhra Pradesh Telangana Today 19 January 2024

Oknews

Leave a Comment