మహానటి తో టాప్ హీరోయిన్ రేంజ్ కి దూసుకెళ్లిన నటి కీర్తి సురేష్.2018 లో వచ్చిన ఆ మూవీ కీర్తికి మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన సినిమాల లిస్ట్ చాలా తక్కువే అని చెప్పవచ్చు. పైగా విజయాల శాతం కూడా తక్కువే. మహేష్ తో చేసిన సర్కారు వారి పాట యావరేజ్ గానే నిలిచింది.దసరా విజయం నాని ఖాతాలోకి వెళ్ళింది. హిందీలోను కొన్ని చిత్రాలు చేసింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ మధ్య చిరంజీవి భోళా శంకర్ లో మెరిసింది. ఆ సినిమా ఫలితం అందరకి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
కీర్తి సురేష్ నటించిన తమిళ చిత్రం సైరన్. ఫిబ్రవరి 19 న తమిళనాడు వ్యాప్తంగా విడుదల అయ్యింది. మంచి విజయాన్నే నమోదు చేసింది.పోలీసు ఆఫీసర్ గా కీర్తి ప్రదర్శించిన నటనకి మంచి పేరే వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ తెలుగులో కూడా విడుదల కానుంది.కాకపోతే థియేటర్స్ లో కాకుండా ఓటిటి లో రిలీజ్ కాబోతుంది. ఏప్రిల్ 19 నుంచి డిస్నీ + హాట్ స్టార్ లో ప్రసారం కానుంది . ఈ విషయాన్నీ సదరు సంస్థ అధికారకంగా వెల్లడి చేసింది. మొత్తం ఐదు భాషల్లో అందుబాటులో ఉండనుంది.
తొలుత తమిళంతో పాటే తెలుగులో కూడా థియేటర్ రిలీజ్ చేద్దామని మేకర్స్ అనుకున్నారు. కీర్తి కి కూడా తెలుగులో మంచి మార్కెట్ ఉంది.పైగా మూవీలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఉంది. మరి మేకర్స్ ఎందుకు థియేటర్ రిలీజ్ చెయ్యలేదో తెలియదు. పక్కా యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన సైరన్ లో జయం రవి హీరోగా నటించాడు. తిలగన్ క్యారక్టర్ లో చాలా పవర్ ఫుల్ గా నటించి ప్రేక్షకుల మెప్పుని పొందాడు. ఆయన భార్య జెన్నీఫర్ క్యారక్టర్ ని అనుపుమ పోషించింది.సముద్ర ఖని ఒక కీలక పాత్రని పోషించాడు.