ఆయన ధైర్యానికి శక్తికి ప్రతీక..కొండలనైనా పిప్పి చెయ్యగల బలవంతుడు. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే ఆపద్భాంధవుడు. దుష్ట శక్తులని నామరూపాలు లేకుండా చేసే సూర్య పుత్రుడు.. ఆయనే హనుమాన్. అదే పేరుతో ఆయన్నే ప్రధాన పాత్రగా చేసుకొని వచ్చిన మూవీ హనుమాన్. ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించింది.
సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమన్ (hanuman)అశేష ప్రేక్షకాదరణ పొందడంతో పాటు రికార్డు స్థాయి కలెక్షన్స్ ని కూడా సృష్టించింది. ప్రేక్షకులకి మరింత దగ్గరవ్వాలనే లక్ష్యంతో ఓటిటి వేదికగా కూడా రిలీజ్ అయ్యింది. జీ5 లో మార్చి 17 న అందుబాటులోకి వచ్చింది. ఈ 5 రోజుల్లో 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది. దీన్నిబట్టి ఓ టిటి లో కూడా హనుమాన్ విజృంభణ ఖాయమనే విషయం అర్ధం అవుతుంది. అసలు టెలికాస్ట్ అయిన గంటల్లోనే మిలియన్స్ కొద్దీ స్ట్రీమింగ్ మినిట్స్ ని కూడా నమోదు చేసింది. త్వరలోనే తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది.
హనుమన్ లో తేజ సజ్జ (teja sajja)అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ ,సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ వర్మ(prashanth varma)దర్శకత్వం వహించగా నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించాడు. థియేటర్స్ లో 250 కోట్ల దాకా వసూలు చేసింది. హనుమాన్ 2(hanuman 2) కూడా ఉంటుందని చిత్ర దర్శకుడు గతంలోనే చెప్పాడు.