సినిమాలకు తెలుగు ప్రేక్షకులకి ఓ విడదీయలేని బంధమే ఉంది. సినిమా థియేటర్లలో రిలీజైన ఓటీటీలో రిలీజైన కథ బాగుంటే చూసేస్తారు. అంతలా సినిమాలకి క్రేజ్ ఉంది. అయితే నెల క్రితం, కొన్నివారాల క్రితం థియేటర్లలో విడుదలైన హిట్ సినిమాలు కొన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్దంగా ఉన్నాయి. అవేంటో ఓసారి చూసేద్దాం…
ప్రేమలు : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
మలయాళంలో తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమా ‘ ప్రేమలు’. ఈ సినిమా మలయాళంలో ఫిబ్రవరి 9 న విడుదల కాగా, తెలుగులో మార్చి 8న విడుదలైంది. కేవలం 5 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ఏకంగా 135 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సాధించింది. నెస్లన్ కే గపూర్ , మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులోకి రాజమౌళి తనయుడు కార్తికేయ తీసుకొచ్చారు. ఏప్రిల్ 12 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు, తమిళ, మలయాళం , కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు.
లాల్ సలామ్ : నెట్ ఫ్లిక్స్
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘ లాల్ సలామ్’.. ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమాకి మిశ్రమ స్పందనలు వచ్చాయి. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే ఇప్పుడు ఇది నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 12 న స్ట్రీమింగ్ కి సిద్దంగా ఉంది.
ఓమ్ భీమ్ భుష్ : అమెజాన్ ప్రైమ్
శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రదాన పాత్రల్లో నటించిన మూవీ ‘ ఓమ్ భీమ్ భుష్’. మార్చి 22 న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ కొట్టింది. లాజిక్ తో సంబంధం లేకుండా మంచి కథతో అంతకు మించిన కామెడీతో రెండన్నర గంటల పాటు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసింది. ఈ సినిమాని ఏప్రిల్ 12 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు.
గామి : జీ5
విశ్వక్ సేన్ హీరోగా ‘ గామి’ సినిమా శివరాత్రికి రిలీజైంది. ఈ మూవీలో అఘోరా పాత్రలో మెప్పించిన విశ్వక్ సేన్.. థియేటర్లలో భారీ వసూళ్ళని సాధించింది. విధ్యాధర్ కాగిత అనే యువ దర్శకుడు ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు ఆరేళ్ళ పాటు నిర్మించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ సినిమాని ఏప్రిల్ 12 న జీ5 లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది.
మరి ఈ నాలుగు సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో ? దేనిని చూడాలనుకుంటున్నారో? దేనికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో కామెంట్ చేయండి.