EntertainmentLatest News

ఓటీటీలోకి యోగి బాబు చట్నీ సాంబార్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!


 

కొన్ని వెబ్ సిరీస్ లో ఓటీటీలోకి రిలీజ్ కి ముందే ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఈ మధ్యకాలంలో ఫ్యామిలీతో కలిసి చూసేలా కామెడీ ప్లస్ ఎమోషన్ ని కలగలిపిన కంటెంట్ రాలేదు. ఆ జానర్ సినిమాల కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడు ఎదురుచూస్తుంటారు. అలాంటి జానర్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఆకట్టుకునేందుకు యోగి బాబు కీలక పాత్రలో నటించిన సిరీస్ రాబోతుంది. అదేంటో ఓసారి చూసేద్దాం.

యోగి బాబు నటించినన వెబ్ సిరీస్ ‘చట్నీ సాంబార్’. దీని ట్రైలర్ తాజాగా రిలీజైంది. అందులో ఏం ఉందంటే…  ఊటీలోని సంప్రదాయ వంటలకి ఫేమస్ ‘అముద హోటల్’ . దానికి సచ్చిద ఓనర్. అతన్ని అందరు సచ్చు అని పిలుస్తారు. అయితే అతనికి తన నాన్న ఎవరో తెలియదు. అదే సమయంలో కార్తిక్ అనే మరో వ్యక్తి వాళ్ళ నాన్న చనిపోయే ముందు సచ్చుని చూడాలనుకుంటాడు. కార్తిక్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఊటిలోని ఆముద హోటల్ కి వెళ్తారు. అక్కడ సచ్చిదని కార్తిక్ అతని ఫ్రెండ్స్ కలిసి కన్విన్స్ చేశారా లేదా అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

జూలై 26 నుండి ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రానున్న ఈ సిరీస్ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.  యోగి బాబు, వాణి భోజన్, మౌలి , నితిన్ సత్య ప్రధాన పాత్రలుగా తెరకెక్కించిన ఈ సిరీస్ లో కామెడీతో పాటు ఫాదర్ సెంటిమెంట్ ఉన్నట్టుంది. అయితే యోగిబాబు కామెడీని ఈ సిరీస్ లో పుల్ లెంత్ గా వాడుకున్నట్టున్నారు. ఈ సిరీస్ కి రాధా మోహన్ దర్శకుడు.  

 



Source link

Related posts

Sobhita Dhulipala is looking forward to motherhood విచిత్రమైన కోరికని బయటపెట్టిన హీరోయిన్

Oknews

Update on Venky-Anil Ravipudi Film అనిల్-వెంకీ మొదలెట్టేది అప్పుడేనా..

Oknews

PM Narendra Modi Telangana tour for two days confirmed in Adilabad and sangareddy districts

Oknews

Leave a Comment