ఓటీటీలోని క్రైమ్ థ్రిల్లర్స్ కి ఉండే క్రేజే వేరు. ప్రతీవారం రకరకాల థ్రిల్లర్ జానర్ సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. అలాంటి వాటిల్లో కొత్త కథలకి ఎక్కువ డిమాండ్ ఉంది. అయితే విమానంలో ప్రయాణిస్తూ హైజాక్ చేసిన సందర్భాలని ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు చూసేశారు. అయితే సముద్రంలో షిప్ లని హైజాక్ చేసే నేపథ్యంలో సాగే కథని ఇప్పటివరకు ఎవరు చూసి ఉండరు.
అలాంటి కథతో తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా ‘ లూటేరే ‘ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సిరీస్ ని రెండేళ్ళ క్రితమే ప్రారంభించిన మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. సోమాలియా సముద్రపు దొంగల చుట్టూ ఈ సిరీస్ కథ సాగుతుంది. అయితే సముద్రపు దొంగ అనగానే పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీసే గుర్తొస్తుంది. అందులో జాక్ స్పారో విన్యాసాలు, డైలాగ్స్, నటన అన్నీ కూడా ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు అదే విధంగా కొత్త సిరీస్ వచ్చేసింది. అయితే ఈ సిరీస్ లో ప్రస్తుతం రెండు ఎపిసోడ్ లు మాత్రమే రిలీజ్ చేశారు. మిగిలిన ఎపిసోడ్ లని తర్వాతి వారం రిలీజ్ చేస్తారని మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు.
లూటేరే వెబ్ సిరీస్ ని హన్సల్ మెహతా క్రియేట్ చేయగా ఆయన కొడుకు జై మెహతా డైరెక్ట్ చేశాడు. సోమాలియన్ దొంగలు ఓ షిప్ ని హైజాక్ చేయడం నేవీ అధికారులు వారిని పట్టుకునే క్రమంలో ఏం చేశారనేది కథ.. అయితే సముద్రపు దొంగల భారీ నుండి షిప్ ని కాపాడారా లేదా సిరీస్ లో చూడాల్సిందే. రజత్ కపూర్, వివేక్ గోంబర్ , అమృతా ఖన్విల్కర్ , ప్రీతికా చావ్లా, చందన్ రాయ్ సన్యాల్ ఫ్రధాన పాత్రలు పోషించారు. మరి మీలో ఎంతమంది ఇలాంటి థ్రిల్లర్స్ ని ఇష్టపడతారో కామెంట్ చేయండి.