EntertainmentLatest News

ఓర్నీ.. పుష్ప కాపీనా..!


అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ (Pushpa) చిత్రం.. 2021 డిసెంబర్ లో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘పుష్ప-2’ రూపొందుతోంది. ఈ ఏడాది డిసెంబర్ 6న విడుదల కానున్న ‘పుష్ప-2’పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇలాంటి టైంలో ‘పుష్ప’పై కాపీ ఆరోపణలు వస్తున్నాయి.

‘పుష్ప’ మూవీ ఎంత హిట్ అయిందో.. అందులో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ అంతకంటే పెద్ద హిట్ అయ్యాయి. ముఖ్యంగా భుజాన్ని పైకెత్తి బన్నీ నడిచిన తీరు, యాటిట్యూడ్.. ప్రేక్షకులను ఫిదా చేశాయి. అయితే ఇది ఎప్పుడో 20 ఏళ్ళ క్రితమే దివంగత నటుడు శ్రీహరి (Srihari) చేయడం విశేషం.

శ్రీహరి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘పృధ్వీ నారాయణ’. 2002లో విడుదలైన ఈ మూవీలో పృధ్వీ అనే పోలీస్ పాత్రతో పాటు, నారాయణ అనే నెగటివ్ రోల్ లో శ్రీహరి నటించారు. నారాయణ పాత్రలో భుజాన్ని పైకెత్తి స్టైల్ గా నడవడంతో పాటు, అదిరిపోయే యాటిట్యూడ్ ని ప్రదర్శించారు శ్రీహరి. ఇప్పుడు ఆ మూవీ క్లిప్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో క్లిప్ లు చూసి అందరూ షాకవుతున్నారు. అంతేకాదు, అప్పుడు ‘పృధ్వీ నారాయణ’ చిత్రంలోని శ్రీహరి మ్యానరిజమ్ నే.. ఇప్పుడు పుష్పరాజ్ పాత్రకి సుకుమార్ పెట్టారని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా, పైగా విజయం కూడా సాధించకపోవడంతో.. ‘పృధ్వీ నారాయణ’ సినిమా గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కొన్ని వీడియో క్లిప్ లు వెలుగులోకి రావడంతో.. కొందరు ‘పుష్ప’పై  కాపీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మ్యానరిజమ్స్ ఒకేలా ఉన్నప్పటికీ.. ఈ రెండు సినిమాల కథలు మాత్రం వేరు కావడం గమనార్హం.



Source link

Related posts

Leaving Skanda.. Ram in smart sets స్కంద వదిలేసి.. ఇస్మార్ట్ సెట్స్ లో రామ్

Oknews

Anupama answer – fans are shocked అనుపమ ఆన్సర్

Oknews

అల్లు అర్జున్ కి బ్యాడ్ టైం స్టార్ట్.. కేసు వేస్తామంటూ బెదిరింపులు…

Oknews

Leave a Comment