Entertainment

‘కంగువ’ మూవీ స్టోరీ ఇదే.. తెలుగు సినిమాకి కాపీనా?


కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి స్పందన లభించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా స్టోరీకి సంబంధించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

‘కంగువ’ సినిమా మొదట నుంచి పీరియడ్ యాక్షన్ ఫిల్మ్ గా ప్రచారం పొందింది. అయితే ఇది పూర్తి పీరియడ్ ఫిల్మ్ కాదట. ‘కంగువ’ అనేది టైం ట్రావెల్ నేపథ్యంలో సాగే ఫాంటసీ ఫిల్మ్ అని తెలుస్తోంది. ఈ కథ 1670 ప్రాంతంలో, అలాగే వర్తమానంలో జరగనుందట. 1670లలో క్రూరమైన ట్రైబల్ వారియర్ గా సూర్య కనిపించనున్నాడట. అయితే టైం ట్రావెల్ చేసి సూర్య ప్రజెంట్ లోకి వస్తాడట. ఒక క్రూరమైన ట్రైబల్ వారియర్ ఎందుకు టైం ట్రావెల్ చేశాడు? ఎలా చేశాడు? వర్తమానంలో అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అనేది ఈ చిత్ర కథాంశమని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ కథ కూడా ఇలాగే ఉంటుంది. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన బింబిసార అనే క్రూరమైన రాజు.. టైం ట్రావెల్ చేసి వర్తమానంలోకి వస్తాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ‘కంగువ’ స్టోరీ లైన్ కూడా అలాగే ఉంది. అయితే బింబిసారలో కళ్యాణ్ రామ్ తనకి తెలియకుండా అనుకోకుండా వర్తమానంలోకి వస్తాడు. కానీ ‘కంగువ’లో సూర్య మాత్రం కావాలనే ఒక మిషన్ మీద ప్రజెంట్ లోకి వస్తాడట. ఆ మిషన్ ఏంటి? ఈ ఆధునిక ప్రపంచంలో అతను ఎలా ఇమడగలిగాడు? తన మిషన్ ని పూర్తి చేసి మళ్ళీ గతంలోకి వెళ్లగలిగాడా? అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుందట.

నిజానికి రెండు నెలల క్రితం ‘కంగువ’ సెకండ్ లుక్ పోస్టర్ విడుదలైనప్పుడే.. ఇది వేరు వేరు కాలాలలో జరిగే కథ అని అర్థమైంది. ఎందుకంటే ఆ పోస్టర్ లో సూర్య యుద్ధవీరుడిగా కనిపించడంతో పాటు ట్రెండీ లుక్ లోనూ సర్ ప్రైజ్ చేశాడు. ఇప్పుడు ఆ పోస్టర్.. ఈ సినిమా ట్రావెల్ ట్రావెల్ నేపథ్యంలో ఉండనుందనే వార్తలకు బలం చేకూరుస్తోంది.

కాగా, గతంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ’24’ అనే టైం ట్రావెల్ కాన్సెప్ట్ మూవీ చేసి మెప్పించాడు సూర్య. మరి ఇప్పుడు శివ  దర్శకత్వంలో చేస్తున్న ‘కంగువ’తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

‘శౌర్యం’, ‘దరువు’, ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేగం’ వంటి కమర్షియల్ సినిమాలు చేసిన శివ.. సూర్యతో ‘కంగువ’ అనే భారీ పీరియడ్ ఫిల్మ్ ని ప్రకటించినప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఇప్పుడిది టైం ట్రావెల్ కాన్సెప్ట్ అని న్యూస్ రావడంతో.. ఈ సినిమాని శివ ఎలా రూపొందిస్తున్నాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.



Source link

Related posts

అల్లు అర్జున్ సినిమాలో ఇక నటించను.. గబ్బర్ సింగ్ సాయి సంచలన నిర్ణయం

Oknews

గోవా బయలుదేరిన ఎన్టీఆర్..దాని కోసమేగా

Oknews

స్కంద 2: బోయపాటి నెక్స్ట్ టార్గెట్ ఎవరు?

Oknews

Leave a Comment