EntertainmentLatest News

కట్టిపడేస్తున్న నాని ‘హాయ్ నాన్న’ టీజర్.. ఏం ఫీల్ ఉంది మామా!


నేచురల్ స్టార్ నాని హీరోగా శౌర్యవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘హాయ్ నాన్న’. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుండగా, నాని కూతురి పాత్రలో బేబీ కియారా ఖన్నా నటిస్తోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది.

‘హాయ్ నాన్న’ మూవీ టీజర్ ఆదివారం ఉదయం విడుదలైంది. ఈ ఫీల్ గుడ్ టీజర్ కట్టిపడేస్తోంది. తండ్రీకూతుళ్ల అనుబంధంతో టీజర్ ఎంతో అందంగా ప్రారంభమైంది. వీరి మధ్యలోకి మృణాల్ ఠాకూర్ పాత్ర ఎంటర్ కావడం ఆసక్తికరంగా ఉంది. వేరే వ్యక్తితో పెళ్ళి పెట్టుకొని, అప్పటికే పెళ్ళయ్యి కూతురున్న హీరోతో హీరోయిన్ ప్రేమలో పడటం.. మొదట్లో ఆమె ప్రేమని ఒప్పుకొని హీరో, ఆ తర్వాత అతను కూడా ఆమె ప్రేమలో పడటం.. వీరిద్దరి ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగింది అనే ఆసక్తిని రేకెత్తిస్తూ టీజర్ బ్యూటిఫుల్ గా రూపొందించారు. ఇక చివరిలో మృణాల్ కూడా నానిని హాయ్ నాన్న అని పిలవడం క్యూట్ గా ఉంది. మొత్తానికి టీజర్ చూస్తుంటే ఫీల్ గుడ్ మూవీతో నాని బిగ్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేయబోతున్నాడని అర్థమవుతోంది. అలాగే ఈ సినిమాని డిసెంబర్ 7న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ టీజర్ చివరిలో చూపించారు.



Source link

Related posts

ఫిబ్రవరి సెంటిమెంట్.. టిల్లు అన్న మల్ల వస్తుండు

Oknews

Samantha అది నాకూ ఇబ్బందే కాని తప్పట్లేదు: సమంత

Oknews

Merry Christmas OTT Release Date And Platform అప్పుడే ఓటీటీలోకి మెర్రీ క్రిస్మస్

Oknews

Leave a Comment