దిశ, ఫీచర్స్ : చాలామంది స్వీట్లు తినడానికి ఎంతగానో ఇష్టపడతారు. ముఖ్యంగా పండుగల సమయంలో ఇష్టమైన స్వీట్లను చేసుకుని తింటారు. అయితే స్వీట్లు ఎక్కువగా తినడం వలన ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే స్వీట్లకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడునే స్వీట్ కాస్త భిన్నమైంది. ఈ స్వీట్ తినడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తడం పక్కన పెడితే ఆరోగ్యాన్ని పెంచుతాయట. ఈ స్వీట్ తింటే అనేక ప్రయోజనాలు కలుగుతాయట. ఎవరైనా ఈ స్వీట్ ను తినొచ్చంటున్నారు. మరి ఆ స్వీట్ ఏంటో దాని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
లికోరైస్ అనే స్వీట్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఈ స్వీట్ ను తినగానే కడుపులోకి వెళ్లిన తర్వాత ఔషధంగా పనిచేస్తుందని కొంతమంది నిపుణులు పేర్కొంటున్నారు. ఈ స్వీట్‌లోని మరో ప్రత్యేకత ఏంటంటే దీన్ని తినొచ్చు, తాగొచ్చంట. ఈ స్వీట్‌ని చాలామంది హెర్బల్ మెడిసిన్‌గా ఉపయోగిస్తారట. దీని ద్వారా క్యాన్సర్ కణాలు కూడా తగ్గుముఖం పడతాయంటున్నారు నిపుణులు.
ఇది పశ్చిమ ఆసియా, దక్షిణ ఐరోపాకు చెందిన స్వీట్. దీనిని చాలా కాలంగా యూరప్ ప్రజలు స్వీట్‌గా ఉపయోగిస్తున్నారు. డచ్, ఇటాలియన్లు 17 వ శతాబ్దంలో లైకోరైస్ రూట్ నుండి ఈ స్వీట్లను తయారు చేసేవారని, ప్రజలు వీటిని చాలా ఇష్టపడేవారని చెబుతారు. ఇంగ్లాండ్ లో ఈ స్వీట్ 18 వ శతాబ్దంలో ప్రారంభమైందని చెబుతారు. దీన్ని భారతదేశంలో ఇప్పటికే ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
Read More..
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగుతున్నాయా?.. కంట్రోల్లో ఉండాలంటే తినాల్సిన ఆహారాలు ఇవే..