Health Care

కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యకు చెక్ పెట్టె ఇంటి చిట్కాలు..


దిశ, ఫీచర్స్ : ఈ రోజుల్లో ఏమి తిన్నా కడుపులో ఎసిడిటీ వస్తుంది. దీని వల్ల కడుపు ఉబ్బరం ఏర్పడి జీర్ణవ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. ఇది ఆహారం, ఒత్తిడి, జీవనశైలి కారకాలపై ఆధారపడి ఉంటుంది. ఎసిడిటీ, గ్యాస్ సమస్యలను ఇంటి చిట్కాలతో సులభంగా తగ్గించుకోవచ్చు.. అవేంటో ఇక్కడ చూద్దాం..

సోంపు నీరు..

సోంపు నీరులో కార్మినేటివ్‌ లక్షణాలు ఉంటాయి. ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. కాబట్టి, రోజూ భోజనం తర్వాత రెండు సోంపు గింజలను నమిలితే సరిపోతుంది లేదా వేడినీటిలో సోంపు పొడి వేసి 15 నిమిషాల తర్వాత తాగాలి. ఇది ఎసిడిటీ సమస్యలకు చెక్ పెడుతుంది.

చల్లని పాలు

చల్లని పాలు తీసుకుంటే కడుపులో గ్యాస్ ఉండదు. ప్రతి రోజూ ఒక గ్లాసు చల్లని పాలు తాగడం వల్ల ఎసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటిని పచ్చిగా తాగలేని వారు తేనే కలుపుకుని తాగవచ్చు.

యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్ కడుపులో యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఒక గ్లాసు నీటిలో కరిగించి తాగాలి. అయితే, ఈ చిట్కాను పాటించే ముందు వైద్యుడిని సంప్రదించి మాత్రమే తీసుకోండి.



Source link

Related posts

ట్రాఫిక్​ సిగ్నల్స్​ రెడ్​, గ్రీన్‌లోనే​ ఎందుకు?

Oknews

39 ఏళ్ల వయసులో 20 వ బిడ్డకు జన్మనివ్వబోతున్న మహిళ.. ప్రతి బిడ్డ తండ్రులు వేర్వేరు.. పైగా ప్రభుత్వం అనుమతితో!

Oknews

ఈ బ్లడ్ గ్రూప్‌ వారు చికెన్, మటన్ తింటున్నారా? తినేముందు ఇవి తెలుసుకోండి!

Oknews

Leave a Comment