కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజై మంచి విజయాన్ని అందుకుంటాయి. అలాంటివి ఇతర భాషల్లో ఉంటే వాటిని అన్ని భాషల వారికి చేరేలే ఇతర భాషల్లో డబ్బింగ్ చేసి ప్రముఖ ఓటీటీ వేదికలపై రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
తాజాగా బూమర్ అంకుల్, నాగేంద్రన్స్ హానీమూన్స్ లాంటి ఇతర భాషా చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. అలాగే ఇప్పుడు కన్నడ మూవీ ‘ శాఖాహారి ‘ ని తెలుగు వర్షన్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లోకి రెండు నెలల క్రితమే రాగా ఈరోజు నుండి తెలుగు వర్షన్ ని రిలీజ్ చేశారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కించిన మూవీ ‘ శాఖాహారి ‘. కథేంటంటే.. ఒక ఊరిలో సుబ్బన్న (రంగాయన రఘు) శాఖాహార హోటల్ నడుపుతుంటాడు. పెళ్ళి చేసుకోకపోవడంతో ఒంటరిగానే ఉంటాడు. అదే సమయంలో వినయ్ అనే అతను సుబ్బన్న హోటల్ లో తలదాచుకుంటాడు. అతన్ని వెతుక్కుంటూ లోకల్ పోలీస్ (గోపాల్ కృష్ణ దేశ్ పాండే) వస్తాడు. వినయ్ గురించి వచ్చిన పోలీస్ కి సుబ్బన్న గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి.. అవేంటి? అసలు సుబ్బన్న మంచివాడేనా కాదా అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
ప్రస్తుతం థ్రిల్లర్ సినిమాలకి ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తోంది. అయితే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీకి కోటి రూపాయలు బడ్జెట్ పెడితే అయిదు కోట్ల పైచిలుకు కలెక్షన్లతో భారీ సక్సెస్ ని అందుకుంది. మరి అంతటి విజయం సాధించిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఓసారి చూసేయ్యండి.