కరోనావైరస్ యువ హీరో నితిన్‌కు చాలానే కష్టాలు తెచ్చిపెడుతుంది. ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ కుర్ర హీరో తన పెళ్లిని దుబాయ్‌లో జరుపుకోవాలని నిర్ణయించుకొన్నాడు. అంతా సవ్యంగా జరుగుతుందనే సమయంలో కరోనావైరస్ విజృంభించడంతో పరిస్థితి తారుమారైంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పటికే దుబాయ్‌లో చేసిన అడ్వాన్సు బుకింగ్స్ గందరగోళంగా మారాయి. తన కుమారుడు నితిన్ పెళ్లిపై నిర్మాత సుధాకర్ రెడ్డి స్పందించారు, నితిన్, షాలిని వివాహానికి దుబాయ్‌లో ఏర్పాట్లు చేశారు. ముందస్తు ప్లాన్ ప్రకారం ఏప్రిల్ 15వ తేదీన పెళ్లి కార్యక్రమాలు, అలాగే ఏప్రిల్ 16వ తేదిన రిసెప్షన్ నిర్వహించాలని అనుకున్నాము. అందుకు దాదాపు 100 మంది వరకు గెస్టులను ఆహ్వానించాము. ఒకవేళ పెళ్లి క్యాన్సిల్ చేస్తే వందమందికి పైగా అతిథుల ట్రావెల్ ప్లాన్స్ బెడిసికొడుతాయి. అడ్వాన్సుగా బుకింగ్ చేసుకొన్న టికెట్లు, ఇతర విషయాల్లో చాలా నష్టం కలుగుతుంది. అదే విషయం మాకు ఆందోళన కలిగిస్తున్నది అని సుధాకర్ రెడ్డి తెలిపారు.