‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) స్పీడ్ కి ఇప్పట్లో బ్రేకులు పడేలా లేవు. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. పలు భారీ సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ ని కేవలం నాలుగైదు రోజుల్లోనే దాటేసింది. మొదటి వారం కూడా పూర్తి కాకుండానే అప్పుడే రూ.700 కోట్ల క్లబ్ లో చేరింది.
‘కల్కి’ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ వీకెండ్(నాలుగు రోజులు)లోనే వరల్డ్ వైడ్ గా రూ.555 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు జులై 1న మేకర్స్ ప్రకటించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా రూ.700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తాజాగా కొత్త పోస్టర్ ను వదిలారు మేకర్స్. కల్కి విడుదలై నేటికి ఏడో రోజు. ఇంకా ఏడో రోజు కూడా పూర్తి కాకుండానే ఈ మూవీ రూ.700 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడం విశేషం.
ప్రభాస్ (Prabhas) కెరీర్ లో రూ.700 కోట్ల క్లబ్ లో చేరిన మూడో సినిమా ‘కల్కి’. గతంలో ‘బాహుబలి-2’ (రూ.1800 కోట్లు), ‘సలార్'(రూ.700 కోట్లు) ఈ ఫీట్ సాధించాయి. ఇప్పుడు ఆ లిస్టులో ‘కల్కి’ చేరింది. ప్రస్తుతం ‘కల్కి’ జోరు చూస్తుంటే.. విడుదలైన రెండు వారాల లోపే ఈ చిత్రం రూ.1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం కనిపిస్తోంది.