పాన్ ఇండియా హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో సి.అశ్వినీదత్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 ఎడి’. ఈ సినిమా బడ్జెట్ రూ.600 కోట్లు అనే విషయం అందరికీ తెలిసిందే. ఒక పాన్ ఇండియా మూవీ బడ్జెట్‌తో సమానంగా ఒక డైరెక్టర్ రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే నమ్ముతారా. కానీ, ఇది అక్షరాలా నిజం. ఒక సినిమాకి హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ రూ.600 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచాడు.
వివరాల్లోకి వెళితే.. ‘ఇంటర్‌స్టెల్లార్’, ‘డన్‌కిర్క్’, ‘ది డార్క్ నైట్’ లాంటి బ్లాక్‌బస్టర్స్‌ను తెరకెక్కించిన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ గత ఏడాది ‘ఓపెన్ హైమర్’ పేరుతో ఓ భారీ చిత్రాన్ని రూపొందించాడు. ఎపిక్ బయోగ్రాఫికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా జూలై 21న విడుదలైంది. 100 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. దాదాపు 900 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేసింది. 2023లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో సినిమాగా ‘ఓపెన్ హైమర్’ నిలిచింది. వార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ఈ సినిమాను డైరెక్ట్ చేసినందుకు క్రిస్టోఫర్ నోలన్‌కు 72 మిలియన్ డాలర్స్ రెమ్యునరేషన్ అందించారు. అంటే భారత కరెన్సీలో సుమారుగా రూ.600 కోట్లు. ‘ఓపెన్‌హైమర్’కు వచ్చిన గ్రాస్ కలెక్షన్స్‌లో కొంత భాగం రెమ్యునరేషన్‌గా తీసుకునేలా నోలన్ ముందుగానే అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ ప్రకారమే నోలన్‌కి ఈ భారీ రెమ్యునరేషన్ అందింది.