కల్కి 2898 ఏడి (kalki 2898 ad)తో రెబల్ స్టార్ ప్రభాస్ (prabhas)స్టామినా ఏంటో మరో సారి అందరకి అర్ధమయ్యింది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన కల్కి అన్ని ఏరియాల్లో రికార్డు కలెక్షన్స్ ని కొల్లగొడుతుంది. పైగా పాజిటివ్ టాక్ కూడా రావడంతో రాబోయే రోజుల్లో సరికొత్త రికార్డులని తన ఖాతాలో వేసుకోడం ఖాయం.దీంతో ఇప్పుడు ఒక విషయం సోషల్ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.
కల్కి మలయాళ సినీ రంగంలో చాలా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ప్రేక్షకులు తమ సొంత సినిమాగా భావించి బ్రహ్మ రధం పడుతున్నారు. తొలి రోజు 2 .2 కోట్ల రూపాయిల నెట్ ని సాధించింది. ఇది మొదటి రోజు విడుదలైన పర బాషా చిత్రాలతోనే హయ్యెస్ట్ అని చెప్పుకోవచ్చు. హిందీలో 24 కోట్లు, తమిళంలో 4 కోట్లు సాధించింది.ఇక చిత్ర బృందం కూడా వరల్డ్ మొత్తం తొలి రోజు 191 కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించినట్టుగా అధికారకంగా ప్రకటించింది.సినిమాకి పాజిటివ్ టాక్ ఉండటంతో మున్ముందు మరిన్ని రికార్డు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.
ప్రభాస్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ కి అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకునే తోడవ్వడంతో కల్కి ని నిండుతనం వచ్చింది. దర్శకుడు నాగ్ అశ్విన్ (nag ashwin)టేకింగ్ కి విజువల్స్ కి అందరు ఫిదా అవుతున్నారు. వైజయంతి మూవీస్ పై సీనియర్ నిర్మాత అశ్వని దత్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి 600 కోట్ల బడ్జట్ తో నిర్మించాడు.