ఇప్పుడు వరల్డ్ మొత్తం ప్రభాస్ (prabhas)కల్కి(kalki 2898 ad)ఫీవర్ తో ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ , ప్రేక్షకులతో పాటు పలువురు సినిమా ప్రముఖులు కల్కి ని చూసి తమ అభినందలని తెలియచేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐటి మరియు మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ (nara lokesh)ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ ని సృష్టిస్తుంది.
కల్కి 2898 ఏడి కి అద్భుతమైన రివ్యూలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కల్కి ఒక కళాఖండం. భారతీయ సినిమాని కల్కి పునర్నిర్వచించినందుకు నా ప్రత్యేక ప్రశంసలు.నిర్మాతలైన అశ్వినీదత్ గారు, స్వప్న మరియు ప్రియాంక గారు అన్ని నిబంధనలను ఉల్లంఘించి తెలుగు సినిమాని గ్లోబల్ లీగ్‌లోకి నడిపించారు. చిత్రం విజయవంతమైన సందర్భంగా ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ ,దీపికపదుకొనే దర్శకుడు నాగ్ అశ్విన్ ,నిర్మాతలకి తన అభినందలు తెలియచేసాడు. ప్రతి ఒక్కరిని గారు అంటు సంబోధిస్తూ తన అభినందలు తెలియచేసాడు. ఇక కల్కి అనేక రికార్డులు సృష్టించే దిశగా ముందుకు దూసుకుపోతుంది.