Health Care

కల్తీ సారా ఎలా చేస్తారు..? తాగితే మనుషులు చనిపోతారా? నిపుణులు ఏం చెబుతున్నారంటే


దిశ, ఫీచర్స్: సాధారణంగా మనం చాలాసార్లు కల్తీ సారా తాగి చనిపోయారు అనే న్యూస్ వింటూనే ఉంటాం కదా. మరి అసలు కల్తీ సారా అంటే ఏంటి?.. దాన్ని ఎలా తయారు చేస్తారు?.. దాన్ని వల్ల కలిగే ప్రమాదాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

నాటుసారా కాయడం, అమ్మడం, తాగడం అనేది ఎప్పటి నుంచో ఎంతో కాలంగా జరుగుతుంది. అయితే చాలా సందర్భాల్లో ఈ నాటు సారా తయారీలో కల్తీ జరిగి విషపూరితంగా మారి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.

అసలు నాటు సారా ఎలా విషతుల్యం అవుతుంది:

నాటు సారా తయారు చేసేటప్పుడు మత్తు ఎక్కువగా వచ్చేందుకు గాను అందులో కొన్ని పదార్థాలు కలుపుతారు. ఈ ప్రోసెస్‌లో అది విషపూరితం అవుతుంది. నాటు సారా సాధారణంగా బెల్లం, మొలాసిస్‌తో తయారు చేస్తారు. కానీ మత్తు కలిగించేందుకు దీనికి యూరియాతో పాటు మరికొన్ని మత్తు కలిగించే పదార్ధాలను చేరవేస్తారు. దీనివల్ల అది విషపూరితం అవుతుంది

మత్తు కలిగించే పదార్థం ఏంటి:

బేసిక్‌గా తయారు చేసే ఆల్కహాల్ మరింత మత్తుగా ఉండేందుకు ఆక్సిటోసిన్ కలుపుతారు. నాటు సారాలో యూరియా, ఆక్సిటోసిన్ కలపడం వల్ల మిథైల్ ఆల్కహాల్ ఏర్పడుతుంది. ఈ మిథైల్ ఆల్కహాల్ తాగితే చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నిపుణుల తెలిపిన దాని ప్రకారం మిథైల్ ఆల్కహాల్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే రసాయన చర్య జరిగి శరీరంలోని అంతర్గత అవయవాలు పనిచేయడం మానేస్తాయి. దీనివల్ల మనిషి చనిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.

నాటుసారా ఎలా ప్రాణాంతకం అవుతుంది:

నాటుసారాలో 95% ఆల్కహాల్ ఉంటుంది. దీన్ని ఇథనాల్ అంటారు. మరింత మత్తు కలిగించేందుకు కొంతమంది అందులో మిథనాల్ కలుపుతారు. దీంతో అది కల్తీ మద్యంగా మారిపోతుంది. ఆ కల్తీ నాటుసారాను సేవించిన వారు చనిపోతారు. ఇథనాల్ మనిషి శరీరానికి అత్యంత ప్రమాదకరం. దీని వల్ల కంటి చూపు కోల్పోవడం నుంచి ఏకంగా మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

ఉదాహరణ:

దీనికి బెస్ట్ ఎక్జామ్‌పుల్ తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కురుమాపురం గ్రామంలో జరిగిన కల్తీ సారా ఘటన. ఈ ఘటనలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 60 మంది ఆసుపత్రి పాలవగా అందులో 39 మంది మృత్యువాత పడ్డారు. మిగతావారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి బాధితులతో నిండిపోయింది.



Source link

Related posts

జియోలో వాయిస్​ బ్రేక్​ సమస్యకు కారణమిదే..

Oknews

Types Of Salt: ఉప్పులో ఐదు రకాలు.. ఆరోగ్యంపై ఏది ఎలా ప్రభావం చూపుతుందంటే..!

Oknews

మొదటి సారి నెలసరి వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే

Oknews

Leave a Comment