GossipsLatest News

కళ్యాణ్‌ని కంటతడి పెట్టించిన లెటర్!


ఐర్లాండ్ దేశంలో  ఓడ కళాసీకిగా పనిచేస్తున్న నా ప్రియమైన జనసైనికుడికి, నీ ఉత్తరం అందింది, చదివిన వెంటనే, గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.. కన్నీరు తెప్పించావు.. కార్యోన్ముఖుడిని చేసావు.. అంటూ తాజాగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. నిజంగా ఈ లెటర్ చదివిన ఎవ్వరైనా కంటతడి పెట్టకుండా ఉండలేరు. లెటర్ చదివిన కళ్యాణ్ కూడా అలాగే రియాక్ట్ అయ్యారు. ఇంతకీ ఓడ కళాసి రాసిన లేఖలో ఏముందంటే..

 

2023 డిసెంబర్ 19వ తేదీన రాసినట్టుగా ఉన్న ఈ లేఖలో..

అన్నా, 

కష్టాలు, కన్నీళ్లు, రుణాలు, దారుణాలు కారణాలుగా చూపిస్తూ..

నా దేశాన్ని వదిలి, విదేశాల్లో అవమానాల్లో ఆనందాలను వెతుక్కొనే నాలాంటి వాళ్ళెందరికో ఒక్కటే నీ మీద ఆశ!  ఎక్కడో బొలీవీయా అడవుల్లో అంతమైపోయింది అనుకున్న విప్లవానికి కొత్త రూపాన్ని ఒకటి కనిపెట్టకపోతావా?

సరికొత్త గెరిల్లా వార్‌ ఫెర్‌ని మొదలెట్టకపోతావా?

మనదేశాన్ని, కనీసం మన రాష్ట్రాన్నైనా మార్చుకోకపోతామా?

17 ఏళ్లుగా ఈ దేశంలో లేకపోయినా, దేశం మీద ప్రేమతో భారత పౌరసత్వాన్ని వదులుకోలేక ఎదురు చూస్తున్న నాలాంటి వాళ్లందరము.. 

మా కోసం నిలబడుతున్న నీకోసం బలపడతాం

2014- నిలబడ్డాం

2019- బలపడ్డాం

2024-బలంగా కలబడదాం!

కారు మీద ఎక్కేటప్పుడు జాగ్రత్త అన్నా.. కారుకూతలు కూసేవారిని పట్టించుకోకన్నా.. కారుమబ్బులు కమ్ముతుంటే..కార్యోన్ముఖిడివై వెళుతున్న నీకు ఆ మహాశక్తి అండగా ఉంటుందన్నా, పవర్‌స్టార్‌వే కదన్నా!

Common Man Protection Forceని ప్రకటించినప్పుడే నిన్ను హీరోగా చూడటం మానేశాను. నువ్వు రాష్ట్రాన్ని ప్రగతివైపు నడిపించే నాయకుడివి ఛే

ఇట్లు

ఐర్లాండ్ నుంచి ఒక ఓడకళాసి.



Source link

Related posts

Top Bollywood Actor To Join Pushpa 2? పుష్ప 2 లోకి బాలీవుడ్ క్రేజీ నటుడు

Oknews

9 years old boy died due to dcm van hit in alwal | DCM Van Accident: అల్వాల్ లో డీసీఎం వ్యాన్ బీభత్సం

Oknews

పూరి జగన్నాధ్ రూటే సపరేటు..ఐటెం సాంగ్ లో ఈ హీరోయిన్?

Oknews

Leave a Comment