Top Stories

క‌ళ్లు తెరుచుకో వార‌సుడా!


వీకెండ్స్‌లో చంద్ర‌బాబుకు సంఘీభావం పేరుతో లోకేశ్ హ‌డావుడి చేస్తున్నారు. స్కిల్ స్కామ్‌లో అరెస్ట‌యి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో చంద్ర‌బాబునాయుడు 50 రోజులుగా వుంటున్నారు. ఇలాంటి రోజులు కూడా త‌మ జీవితాల్లో వ‌స్తాయ‌ని చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌తో పాటు టీడీపీ నేత‌లెవ‌రూ ఊహించ‌లేదు. అస‌లు చంద్ర‌బాబు అంటేనే చ‌ట్టాల‌కు అతీత‌మైన నాయ‌కుడ‌న్న రేంజ్‌లో ఇంత‌కాలం వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేస్తూ వ‌చ్చారు.

అయితే కాలం అనేది అంద‌రి స‌ర‌దాల‌ను తీరుస్తూ, గుణ‌పాఠాలు నేర్పుతూ వుంటుంది. చంద్ర‌బాబునాయుడి రాజ‌కీయ‌, జీవిత చ‌ర‌మాంకంలో కాలం దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. చ‌ట్టానికి బాబు అతీతుడు కాద‌ని, అవినీతికి పాల్ప‌డితే జైలుకు పంపుతార‌ని, స‌న్మానాలు చేయ‌ర‌ని కాలం తేల్చి చెప్పింది. బాబుపై అవినీతి నిరూప‌ణ కేవ‌లం సాంకేతికప‌ర‌మైన అంశ‌మే. ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో వుంది.

అయితే చంద్ర‌బాబును అక్ర‌మంగా అరెస్ట్ చేశార‌ని, జైల్లో ఉన్న ఆయ‌న‌కు సంఘీభావంగా కుటుంబ స‌భ్యులు వీకెండ్స్‌లో సంఘీభావ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కూ మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి, న్యాయానికి సంకెళ్లు, మ‌నం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం కార్య‌క్ర‌మాలను ఐదు నిమిషాల పాటు నిర్వ‌హించారు. ఈ ప‌రంప‌ర‌లో ఆదివారం క‌ళ్లు తెరిపిద్దాం పేరుతో నిర‌స‌న కార్య‌క్ర‌మానికి లోకేశ్ పిలుపునిచ్చారు. జ‌గ‌నాసుర చీక‌టి పాల‌న‌కు వ్య‌తిరేకంగా క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకుని నిజం గెల‌వాలి అని గ‌ట్టిగా అర‌వాల‌ని లోకేశ్ సూచించారు.

చంద్ర‌బాబు అరెస్ట్‌కు దారి తీసిన ప‌రిస్థితులేంటో అంద‌రికీ తెలుసు. అయితే త‌మ నాయ‌కుడిని అరెస్ట్ చేయ‌డం ఏంట‌నే వితండ వాదాన్ని న్యాయ‌స్థానం వెలుప‌ల లోకేశ్ స‌హా టీడీపీ నేత‌లు చేస్తున్నారు. ఎవ‌రి క‌ళ్లు తెరిపించాల‌ని లోకేశ్ అనుకుంటున్నారో గానీ, ముందు తాను తెరిస్తే టీడీపీకి మంచిది. లేదంటే అస‌లుకే ఎస‌రొస్తుంది. చంద్ర‌బాబు అరెస్ట్ అక్ర‌మ‌మ‌ని వీధుల్లో రంకెలేస్తే ప్ర‌యోజ‌నం లేదు.

బాబు అవినీతికి పాల్ప‌డ‌లేద‌ని న్యాయ‌స్థానాల్లో నిరూపించుకోవాలి. కోట్లాది రూపాయ‌లను సుప్రీంకోర్టు లాయ‌ర్ల‌కు ఫీజు రూపంలో చెల్లిస్తున్నా, బాబుకు ఉప‌శ‌మ‌నం ద‌క్క‌క‌పోవ‌డానికి ఆయ‌న ప‌క్షాన న్యాయం లేద‌ని తెలుసుకుని లోకేశ్ క‌ళ్లు తెర‌వాల‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇటు పాల‌క పార్టీ, అటు ప్ర‌తిప‌క్ష పార్టీ కూడా నిజ‌మే గెల‌వాల‌ని కోరుకుంటున్నాయి. అయితే తాము చెబుతున్న‌వే నిజాల‌ని, ప్ర‌త్య‌ర్థులు ఏం చెప్పినా అబ‌ద్ధాల‌ని బుకాయించ‌డంతోనే అస‌లు స‌మ‌స్య‌.

నిజం నిప్పులాంటిదంటారు. అలాంట‌ప్పుడు టీడీపీ ఎందుకు భ‌య‌ప‌డుతున్న‌దో అర్థం కాదు. ఇంత కాలం అవినీతి కేసుల్లో స్టేల‌పై కొన‌సాగడానికి ఏ వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేశారో లోకేశ్ స‌మాధానం చెప్పాలి. త‌మవి కాని రోజులు రావ‌డంతో గ‌ట్టిగ‌ట్టిగా అరిచినంత మాత్రాన నిజాలు అబ‌ద్ధాలు కావు. అలాగే అబ‌ద్ధాలు నిజాలు కావు. ముందు త‌న క‌ళ్ల‌కు క‌ట్టుకున్న గంత‌లు విప్పి లోకాన్ని వాస్త‌వ దృష్టితో చూడ‌డం లోకేశ్ అల‌వ‌రుచుకోవాలి. అప్పుడే లీడ‌ర్ అనిపించుకుంటారు. 

తాను క‌ళ్లు మూసుకుని, లోకం క‌ళ్లు తెరిపిస్తాన‌ని అన‌డం అంటే …అంత‌కు మించిన అహంకారం ఏముంటుంది? మ‌నిషిని ప‌త‌నం చేసేది అహంకార‌మే. ఆ అహంకార ల‌క్ష‌ణాలు లోకేశ్‌లో పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. కావున అహంకారంతో మూసుకుపోయిన క‌ళ్ల‌ను తెర‌వాల్సిన అవ‌స‌రం లోకేశ్‌కే వుంది.



Source link

Related posts

లోకేష్ .. నియోజ‌క‌వ‌ర్గాన్ని దాచి ఉంచుతున్నారా!

Oknews

అన్న ప్రభుత్వం మీద విశాఖలో తొలి నిరసన…!

Oknews

రిటైర్డ్ వెటరన్‌లని చేరదీసి ఏం చేయాలని?

Oknews

Leave a Comment