Health Care

కళ్ల కింద నల్లటి వలయాలు ఉన్నాయా.. ఇలా పోగొట్టుకోండి..


దిశ, ఫీచర్స్ : కళ్లకింద ఉన్న నల్లటి వలయాలను డార్క్ సర్కిల్స్‌ని పిగ్మెంటేషన్ స్పాట్స్ అంటారు. కొందరు వ్యక్తులు కళ్ల కింద నల్లటి వలయాలను సమస్యను లైట్ తీసుకుంటారు. కానీ తేలికగా కనిపించే ఈ డార్క్ స్పాట్స్ స్కిన్ టోన్ ను పాడు చేస్తాయి. దీని వల్ల సౌందర్యం చెడిపోవడమే కాకుండా చర్మం కూడా వదులుగా కనిపిస్తుంది. అయితే చాలామంది ఈ నల్లటి వలయాలను పోగొట్టుకునేందుకు చికిత్సలు తీసుకుంటూ ఉంటారు. అయితే ముఖం పై ఉన్న ఈ నల్లటి వలయాలను పోగొట్టడంలో కొన్ని హోం రెమెడీస్ ఉపయోగపడతాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. పిగ్మెంటేషన్ మచ్చలు, వాటిని నివారించే మార్గాల గురించి ఇప్పుడు మనం తెలసుకుందాం.

ముఖం మీద పిగ్మెంటేషన్ కు కారణాలు

తక్కువ నీరు తాగడం

మొబైల్, సిస్టమ్ ఎక్కువగా చూడడం.

జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం

అధిక ఒత్తిడి

గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం కారణంగా కళ్ల కింద నల్లటి వలయాలు కూడా ఏర్పడతాయి.

కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించడానికి కొన్ని చిట్కాలను చూద్దాం..

ఆల్మండ్ ఆయిల్ : మీకు కళ్ల కింద నల్లటి వలయాలు వస్తే వాటిని తొలగించేందుకు బాదం నూనె చాలా ఉపయోగపడుతుంది. పిగ్మెంటేషన్ తొలగించడానికి 1 టీస్పూన్ బాదం నూనె, నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని మీ కళ్ల కింద వృత్తాకారంలో మసాజ్ చేయండి. దీన్ని రోజుకు రెండుసార్లు మసాజ్ చేయడం వల్ల మచ్చలు, మచ్చల సమస్య తొలగిపోతాయి.

పసుపు : పసుపులో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది బ్యూటీ ప్రొడక్ట్స్, హోం రెమెడీస్ లో కూడా ఉపయోగించబడుతుంది. పసుపు కూడా డార్క్ సర్కిల్స్‌ పోగొట్టడంలో మేలు చేస్తుంది. కళ్ల కింద పిగ్మెంటేషన్‌ను తొలగించడానికి, అర టీస్పూన్ పసుపు తీసుకోండి. ఇప్పుడు ఈ పసుపుకు 3 నుండి 4 చుక్కల పుదీనా నూనె వేయండి. చేతులతో మసాజ్ చేసిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి.

దోసకాయ : కళ్లకింద నల్లటి వలయాలను తొలగించడానికి దోసకాయను ఉపయోగిస్తారు. దోసకాయ ముక్కలను కట్ చేసి మీ కళ్లపై ఉంచండి. ఇలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి.



Source link

Related posts

పప్పులకు పురుగు పట్టకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Oknews

ఇంటి టెర్రస్ పై ఈ వస్తువులు పెడుతున్నారా .. లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురైనట్టే.. !

Oknews

డయేరియాతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేసి ఆ సమస్యకు చెక్ పెట్టండి

Oknews

Leave a Comment