ByGanesh
Mon 11th Mar 2024 10:12 AM
నేషనల్ క్రష్ రష్మిక ఇప్పుడు నార్త్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. సౌత్ లో ఎప్పుడో టాప్ చైర్ దగ్గరకొచ్చేసిన రష్మిక కి హిందీ సినిమాలు వరస షాకులిచ్చాయి. రీసెంట్ గా వచ్చిన యానిమల్ మాత్రం రశ్మికని అందనంత ఎత్తులో నించోబెట్టింది. ప్రస్తుతం ధనుష్ తో కుబేర పాన్ ఇండియా ఫిలిం, పుష్ప ద రూల్ ఫిల్మ్స్ తో పాటుగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల షూటింగ్స్ తో క్షణం తీరిక లేని రష్మిక తాజాగా ఆడవాళ్లు పీరియడ్స్ వచ్చినప్పుడు పడే బాధలను తాను అనుభవిస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది.
ఆడవాళ్లు హార్మోన్స్ ఇన్ బాలన్స్ వలన నెలసరి వచ్చినపుడు అనేకరకాల బాధలు పడుతూ ఉంటారు. కడుపు నొప్పి, తలనొప్పి, కోపము, చిరాకు, ఇలాంటి ఇబ్బందులని ఎదుర్కుంటూ ఉంటారు. గతంలో శృతి హాసన్ ఇలాంటి నెలసరుల గురించి ఓపెన్ అయ్యింది. తాజాగా రష్మిక కూడా ఇలాంటి ఇబ్బందే పడుతుందట. తన పిరియడ్ బాధలను చెబుతూ.. ఇప్పుడు నొప్పి ఎక్కువైంది, బాధ ఎక్కువైంది.. ఇప్పుడేం చెయ్యమంటారు.. అంటూ ఇన్స్టాలో అభిమానులని డైరెక్ట్ గా అడిగేసింది.
ప్రశాంతంగా ఉండేందుకు సినిమా చూడాలా? చాకలేట్, ఐస్ క్రీం లాంటివి తినాలా? ఎవరినైనా లాగి ఒక్కటివ్వాలా? కాదంటే ఏడుస్తూ కూర్చోవాలా? అంటూ రశ్మిక పిరియడ్ కష్టాలని ఏకరువు ప్తెటింది. అయితే ఏది చేసినా ఆడవాళ్ళకి ఆ సమయంలో రెస్ట్ తప్ప వేరే దారి లేదు అని, మైండ్ ని ప్రశాంతంగా ఉంచుకోవడం, మెడిటేషన్లతో కొంతవరకు సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు సలహాలిస్తున్నారు.
Rashmika Mandanna Suffering with Painful Periods:
Rashmika Mandanna about Painful Periods