తొలి నుంచి ఇదే చర్చభద్రాచలంలో బీఆర్ఎస్(BRS) తరఫున గెలుపొందిన తెల్లం వెంకట్రావు(Tellam Venkat rao) కాంగ్రెస్ పార్టీలో చేరతారని ముందు నుంచి అంతులేని చర్చ సాగుతోంది. ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడైన రోజున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS) అదే రోజున కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చర్చ జరిగింది. అయినప్పటికీ అది వాస్తవం కాదని ఆయన కొట్టి పారేశారు. ఆ తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం మరింత చర్చకు కారణమైంది. ఆ తర్వాత సైతం ఎమ్మెల్యే వెంకట్రావు మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) కలిసి అభినందనలు తెలియజేశారు.
Source link