టీటీడీ ఉద్యోగుల క్వార్టర్ల అభివృద్ధి
తిరుమలలో రూ.14 కోట్లతో టీటీడీ ఉద్యోగులకు(TTD Employees) చెందిన పాత సీ టైప్, డీ టైప్, కొత్త సీ టైప్, డీ టైప్ క్వార్టర్లలో మిగిలిన 184 క్వార్టర్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు టీటీడీ బోర్డు ఆమోదించింది. ఐటీ సేవల కోసం టీటీడీకి టైర్ 3 డేటా సెంటర్, డిజాస్టర్ రికవరీ సెంటర్ ఉన్నాయి. ఐటీ స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం, లైఫ్‌సైకిల్ మేనేజ్‌మెంట్ ప్రాసెస్‌లో భాగంగా ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి టెక్ రీప్లేస్‌మెంట్ చేయాలి. ఇందులో భాగంగా ఐదేళ్లపాటు డేటా సెంటర్ల నిర్వహణకు రూ.12 కోట్లకుపైగా బోర్డు మంజూరు చేసింది. శ్రీవాణి ట్రస్ట్ (Srivani Trust)ఫండ్స్ ద్వారా 15 పురాతన ఆలయాలు, టీటీడీ నిర్మించిన 13 దేవాలయాలు, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న మరో 22 దేవాలయాలలో అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు బోర్డు అనుమతి ఇచ్చింది. ఇటీవల ఘాట్ రోడ్డులో ప్రమాదంలో మరణించిన తిరుమల శ్రీవారి ఆలయ పరిచారిక యతిరాజన్ నరసింహన్ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.