ఇకపై పిఠాపురమే నా స్వస్థలం
పిఠాపురం(Pithapuram)నుంచి పోటీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం నియోజకవర్గాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటానన్నారు. పిఠాపురం, గాజువాక, భీమవరం నియోజకవర్గాలు తనకు మూడు కళ్లలాంటివన్నారు. మంగళవారం మంగళగిరి పార్టీలో కార్యాలయంలో… పవన్ కల్యాణ్ మాట్లాడారు. తాను ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా ఇక నుంచి పిఠాపురం నుంచే ఏపీ భవిష్యత్ దశ దిశా మార్చేందుకు పనిచేస్తానన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో మిథున్ రెడ్డి బాగా బాగా తిరుగుతున్నారుగా, మీకేమైనా బంధువులు అవుతారా అంటూ పవన్ కల్యాణ్ సరదాగా అన్నారు. తూర్పుగోదావరి జిల్లా(East Godavari) పిఠాపురం ఒక ప్రత్యేక స్థానమని పవన్ కల్యాణ్ అన్నారు. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేయమన్నారని, కానీ తాను ఆలోచించానన్నారు. పిఠాపురంలో కులాల ఐక్యత జరగాలన్నారు. ఇక్కడ కాపులు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు.