ఆ శాఖల్లో భారీగా నకిలీ ఉద్యోగులు…
స్కిల్ డెవలప్‌మెంట్, ఏపీడీసీ, ఈ ప్రగతి, ఆర్టీజీఎస్, స్పందన కాల్ సెంటర్లలో వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు కల్పించారు. ఇలా ఒకటో రెండో కాదు వందలాది మంది నకిలీ ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు చెల్లించారు. ఈ శాఖలతో సంబంధం లేని వారు, వైసీపీ తరపున సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం చేసిన వారు, వారి కుటుంబ సభ్యులకు ఈ ఖాతాల నుంచి చెల్లింపులు జరిపారు. యూ ట్యూబర్లు, మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా ఈ జాబితాలలో ఉన్నారు.