Telangana

కామారెడ్డిలో విషాదం, అప్పుల బాధతో రైతు ఆత్మహత్య-kamareddy crime news in telugu farmers committed suicide due debt issues ,తెలంగాణ న్యూస్



Kamareddy Crime : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. మండల కేంద్రానికి చెందిన కుమ్మరి లక్ష్మీపతి (55) బుధవారం ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బంధువులకు, తెలిసిన వారికి అడిగిన ఆచూకీ తెలియలేదు. దీంతో గ్రామంలో, గ్రామ పరిసర ప్రాంతంలో వెతుకుతున్న సమయంలో సొంత పొలం వద్ద చెట్టుకు నైలాన్ తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. లక్ష్మీపతి భార్య లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై కొండ విజయ్ తెలిపారు. రైతు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



Source link

Related posts

kakatiya university police filed pocso case on circle inspector | పోలీస్ అధికారిపై పోక్సో కేసు

Oknews

KTR Flexis: కూకట్‌పల్లిలో కేటీఆర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

Oknews

Gold Silver Prices Today 13 April 2024 know rates in your city Telangana Hyderabad Andhra Pradesh Amaravati | Gold-Silver Prices Today: కనికరం చూపని పసిడి

Oknews

Leave a Comment