సంక్రాంతి బరిలోకి దిగి మంచి విజయాన్ని అందుకున్న కింగ్ నాగార్జున ‘నా సామిరంగ’ డిజిటల్‌లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ బిన్ని దర్శకత్వం వహించారు. బెజవాడ ప్రసన్న కుమార్ కథ, మాటలు అందించారు. ఈ సినిమాలో నాగార్జున సరసన అశికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ కీలక పాత్రల్లో నటించారు.
గతంలో కూడా సంక్రాంతి విజయాలు సొంతం చేసుకున్న కింగ్ నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీతో 2016లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ చిత్రం రూపొందింది. 2022 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. ఇక ఈ సంవత్సరం అలాంటి ఓ డిఫరెంట్ ప్యాట్రన్‌లో రూపొందిన ‘నా సామిరంగ’ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్‌హిట్ కావడం విశేషం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి. అయితే డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ‘నా సామిరంగ’ తప్పకుండా ట్రెండిరగ్ మూవీ అవుతుందనే అంచనాలు వున్నాయి.