Kumari Aunty Food Stall : హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి వద్ద స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తూ జీవనం సాగిస్తున్న కుమారీ ఆంటీ… సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఫేమస్ అయ్యింది. యూట్యూబ్ వీడియోలు, ఇన్ స్టా రీల్స్ కుమారీ ఆంటీ వైరల్ అయ్యింది. దీంతో ఆమె ఫుడ్ స్టాల్ వద్ద రద్దీ అమాంతం పెరిగింది. యూట్యూబ్ వీడియోస్ తో కస్టమర్స్ కూడా బాగా పెరిగాయి. ఆమె మాట్లాడిన రెండు లివర్లు వెయ్యి రూపాయిలు అనే డైలాగ్ నెట్టింట వైరల్ అయ్యింది. ఇక యూట్యూబ్ ఛానల్స్ కుమారీ ఆంటీ వీడియోస్ కోసం క్యూకట్టారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడంతో యువత కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ కు పోటెత్తారు. ఆ పాపులారిటీనే ఆమెకు కష్టాలు తెచ్చిపెట్టాయి. కుమారీ ఆంటీ వద్ద భోజనానికి కస్టమర్లు పోటీ పడడంతో రద్దీ భారీగా పెరిగింది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి, కుమారీ ఆంటీపై కేసు నమోదు చేశారు. ఇలా రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని షాపు మూసివేయాలని కోరారు. దీంతో కొద్దిసేపు పోలీసులు, కుమారీ ఆంటీ మధ్య వాగ్వాదం జరిగింది.
Source link