మాదిగల జోడో యాత్రఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ క్రైస్తవ వ్యతిరేకి పార్టీ కేవలం బీజేపీనే అని పిడమర్తి రవి విమర్శించారు. బీజేపీ ఈసారి కేంద్రంలో అధికారం కోల్పోతుందని ఆ పార్టీ మాదిగల సమస్యలు చెప్పుకునే అవకాశం ఉండదన్నారు. మాదిగలు బీజేపీకి ఓటు వేయొద్దని, జిల్లాలో మాదిగల జోడోయాత్ర విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రేపు పెద్దపల్లి, కరీంనగర్ లో మాదిగల జోడో యాత్ర ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా నాయకులు బరికుంటా శ్రీనివాస్, మాల్యాల గోవర్ధన్, నేషనల్ దళిత సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు బుదాల బాబురావు, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Source link