Andhra Pradesh

కుల సభలో రాష్ట్ర అధినేత! Great Andhra


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై 20న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన కమ్మ కుల సమ్మేళనానికి హాజరై ప్రసంగించడం దారుణం. కుల సభలు ఆయా కులాల వారు నిర్వహించుకోవడం ఆనవాయితీ. అయితే, ఆధిపత్య కులాలు తమ సమాజంపై పట్టుని తెలియచెప్పడానికి, తమ ఖ్యాతిని బాహాటంగా ప్రచారం చేసుకోవడానికి నిర్వహించే సభలో ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి వంటి నాయకుడు హాజరవడం ఒక దుష్పరిణామం.

ఆయన రాజకీయ ప్రస్థానం ఆ కుల పెద్దల అండదండలతోనే మొదలైనప్పటికీ, తెలంగాణ లాంటి పోరాట భూమికి ముఖ్యమంత్రి గా ఉంటూ రాష్ట్ర “ఇజ్జత్” ను పణంగా పెట్టిన చర్యగా చెప్పవచ్చు. ప్రత్యేక తెలంగాణ నినాదం బలం గా నిల్చుని “ఆంధ్రోళ్ల” ఆధిపత్యం కారణంగా పోరాడిన రాష్ట్రంలోనే ఆ ఆధిపత్యానికి ప్రధాన కారణం అయిన కులానికి చెందిన సభకు హాజరుకావడం ఉద్యమంలో అసువులు బాసిన వారి త్యాగాన్ని అవమానించడమే.

కేసీఆర్ ని ఓడించి ప్రజా ప్రభుత్వం స్థాపించామనే కాంగ్రెస్ పార్టీ ఈ చర్యను ఎలా సమర్థిస్తుంది? రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత అభీష్టంతో వెళ్ళారా లేక ఇది పార్టీ విధి విధానమా? జాతీయ పార్టీ వెన్నుదన్ను ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య కులవాదానికే మా ఓటు అని ప్రకటిస్తుందా? మరోవైపు రాహుల్ గాంధీ కుల గణన గురించి మాట్లాడటం, ప్రభుత్వ పదవుల్లో బీసీలకు తగు నిష్పత్తిలో ప్రాతినిధ్యం కల్పించాలనడం మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుల గణన ఊసే ఎత్తకపోవడం? రాహుల్ గాంధీ అంబానీ పెళ్లికి పిలిచినా వెళ్ళక నిరసించడం, అలాంటి డబ్బు ప్రదర్శనలో భాగమైన కుల సభకు రేవంత్ రెడ్డి హాజరై తన ఆమోదాన్ని తెలపడం వైరుధ్యంగా ఉంది.

ఇదే జూలై మాసంలో జరిగిన కారంచేడు నరమేధానికి నేటికి 39 ఏళ్లు. ఇంకా ఈ రెండు రాష్ట్రాల్లో దళితులు రాజ్యాధికారానికి దూరంగానే ఉన్నారు. ఆ నరమేధాన్ని కావించిన అధిపత్య కుల సమ్మేళనానికి తెలంగాణ దళిత ఓటు బ్యాంకును గంపగుత్తగా సాధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హాజరవడంలో దాగి ఉన్న రాజకీయ అపహాస్య కేళి లౌకిక ఆలోచనాపరులను దహించివేస్తుంది.

డాక్టర్ జి. నవీన్
Email: [email protected]
రచయిత 20 ఏళ్లుగా సామాజిక, రాజకీయ విషయాల పై విశ్లేషణాత్మక వ్యాసాలు రాస్తున్నారు



Source link

Related posts

Vijayawada CP: సిఎంను రాయితోనే కొట్టారు… రాయిని దేనితో విసిరారో మాత్రం ఇంకా తెలీదన్న విజయవాడ సీపీ కాంతిరాణా

Oknews

‘అరుణాచలం’ వెళ్లొద్దామా..! తక్కువ ధరలోనే 4 రోజుల టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు-telangana tourism 4 days arunachalam tour package from hyderabad ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

చంద్రబాబుకు మద్దతుగా మోత మోగించిన టీడీపీ శ్రేణులు, డ్రమ్స్ కొట్టిన భువనేశ్వరి-tdp cadre protest on chandrababu arrest participated in mothamogiddam programme ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment