శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ లోకనాథం (31), తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు కువైట్ మృతుల్లో ఉన్నారని వెల్లడించింది. వీరి మృతదేహాలు శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుతాయని, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది.