అది శ్రీకాకుళం జిల్లా.. కూర్మ గ్రామం.. అక్కడ ఎలక్ట్రిసిటీ సరిగ్గా ఉండదు.. టెక్నాలజీ సరిగ్గా లేని ఊరు. అసలేముంది ఈ ఊర్లో.. కూర్మా అవతారంలో విష్ణువు ఉంటాడు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా విష్ణువు ఉంటాడు. మరి ‘కూర్మనాయకి’ మూవీకి, కూర్మావతరంలో ఉన్న విష్ణువుకి అసలు సంబంధమేంటి అనేది తెలియాలంటే ఈ సినిమా వచ్చేంతవరకు వేచి ఉండాల్సిందే.
ఈ సినిమాలో శివాజీ ఓ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నాడు. తాజాగా ‘ రోహన్ ప్రొడక్షన్స్ (Rohan Productions ) యూట్యూబ్ ఛానెల్ లో.. welcome on board sivaji అంటూ ఓ గ్లింప్స్ ని వదిలారు. ఇందులో శివాజీ కుడి కంటికి ఏదో గాయం అయినట్టుగా కాశాయ వస్త్రాలు వేసుకొని వస్తుంటే జనాలు ఊరేగింపుగా రావడం చూస్తుంటే.. చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ లా అనిపిస్తుంది. బిజిఎమ్ సినిమాకి మరింత ప్లస్ అయ్యేలా ఉంది.. అది ఈ గ్లింప్స్ లోనే అర్థమవుతుంది.
బిగ్ బాస్ తర్వాత శివాజీ మొదటి సినిమా కాబట్టి భారీగానే సక్సెస్ అయ్యేలా ఉంది. అంతకముందు ఈటీవీ విన్ లో వచ్చిన #90’s వెబ్ సిరీస్ రిలీజ్ అయి ఎంత సక్సెస్ వచ్చిందో అందరికి తెలిసిందే. ఇప్పటికి ఆ సిరీస్ లోని కొన్ని కామెడీ సీన్లు మనకి ఇన్ స్టాగ్రామ్ లో కన్పిస్తుంటాయి.
కూర్మనాయకి మూవీ దర్శకుడు కె హర్ష వర్దన్. ఇక ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ చేశాడు. మరి ఈ టీజర్ లో కథ ఆసక్తిగా ఉంది. మరి సినిమాలోని మలుపులు, శివాజీ, వరలక్ష్మి శరత్ కుమార్ ల నటన సినిమాకి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి మరి.