CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా జలాలపై వాడీవేడిగా చర్చ జరుగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…తెలంగాణకు కృష్ణా నీళ్లు ప్రాణప్రదాయం అన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ప్రజలు కృష్ణాపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. మహానుభావుడు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు రాకుండా తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నారన్నారు. ప్రజలకు సందేశాన్ని ఇవ్వాల్సిన కేసీఆర్ సభకు రాకుండా ఫామ్ హౌస్ లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేది లేదని, జలాల్లో 68 శాతం వాటా తెలంగాణకు ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానం చేసిందని గుర్తుచేశారు. ఈ తీర్మానానికి అనుకూలమో, వ్యతిరేకమో విపక్ష నేతలు స్పష్టత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దొంగలకు సద్దులు మోసే వ్యవహారం మంచిది కాదన్నారు.
Source link