Entertainment

కెమెరామెన్ థామస్ ప్రేమలో రవితేజ హీరోయిన్…పిక్స్ వైరల్ 


ప్రేమకి మేమేమి అనర్హులం కాదంటు  సినిమా ఇండస్ట్రీ పుట్టిన దగ్గరనుంచి ఎంతో మంది హీరోయిన్లు ప్రేమలో పడుతూనే వస్తున్నారు. అలాగే  ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ ప్రేమని గెలిపించుకుంటు కూడా వస్తున్నారు. కానీ కొంత మంది హీరోయిన్లు అయితే మాత్రం తమ ప్రేమ గురించి  ఎవరకి చెప్పారు. మరికొంతమంది మాత్రం తమ ప్రియుడి ద్వారా ఇన్ డైరెక్ట్ గా చెప్పిస్తారు. తాజాగా ఒక హీరోయిన్ మీద ఇప్పుడు ఇదే విధమైన అనుమానం వస్తుంది.

మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీలో రవితేజ తో  ఆడిపాడిన నటి రజిషా విజయన్.లంగా ఓణీలో ఎంతో చక్కగా ఇమిడిపోయిన రజిషా బబ్లింగ్ పెర్ ఫార్మెన్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు ఆమె ప్రముఖ కెమెరామాన్ టోబిన్ థామస్ తో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది. తాజాగా టోబిన్ తన ఇనిస్టాగ్రమ్ లో రజిషా తను కలిసి ఉన్న ఫోటోలని షేర్ చేసి 1461 రోజులు నీతో కలిసి ఉన్నాను.ఆ సమయంలో కలిగిన ప్రేమ సంతోషం మర్చిపోలేనిది. అలాగే ఇద్దరం మన అల్లరిని భరిస్తు మరిన్ని ప్రయాణాలు చేయాలనుకుంటున్నాం అనే క్యాప్షన్ ని రాసుకొచ్చాడు.రజిషా కూడా ఆ పోస్ట్ కి పాజిటివ్ గా రిప్లై ఇచ్చింది. 

ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ వైరల్ గా మారింది. అలాగే ఇద్దరు ప్రేమలో ఉన్నారని కూడా అంటున్నారు.ఇక రజిషా,  టోబిన్ లు  గతంలో ఖోఖో, లవ్లీ యువర్స్ చిత్రాలకి కలిసి పని చేసారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే   రజిషా అనుమతితోనే థామస్ ఆ పిక్స్ ని తన ఇనిస్టాలో షేర్  చేసాడని కూడా అంటున్నారు.

 



Source link

Related posts

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'RK పురంలో'..

Oknews

Hey Google, Talk to Feedly – Feedly Blog

Oknews

ప్రభాస్ సలార్ కి రవితేజ కిక్ కి  ఉన్న లింక్ ఇదే..రవితేజ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్  

Oknews

Leave a Comment