EntertainmentLatest News

కేజిఎఫ్ పార్ట్ 3 రెడీ.. యష్ ప్లేస్ లో మరో సూపర్ స్టార్!  


కేజిఎఫ్(kgf)మొదటి పార్ట్  సిల్వర్ స్క్రీన్ మీద కాలు మోపే వరకు ఆ మూవీ మీద ఎవరకి ఎలాంటి అంచనాలు లేవు. ఇక రిలీజ్  తర్వాత జగమంత  కుటుంబం నాది అనే పాటకి తగ్గట్టు ఆల్ ఓవర్ ఇండియా పెద్ద సునామినే సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2(kgf 2)కూడా అదే రూట్ లో ట్రావెల్ చేసి  సూపర్ డూపర్ హిట్ ని అందుకుంది. పైగా ఇండియాలోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన మొదటి పది సినిమాల  జాబితాలో కూడా నిలిచింది. ఇప్పుడు కేజిఎఫ్ కి మూడవ పార్ట్ సిద్ధం అవుతుందనే వార్తలు వస్తున్నాయి.ఇందులో ఏముంది స్టార్ట్ అవ్వడం సిల్వర్ స్క్రీన్ కి  మంచిదే కదా అని అనుకుంటున్నారా!  మంచిదే. కానీ హీరో విషయమే సంచలనం సృష్టిస్తుంది.

కేజిఎఫ్ సిరీస్ తో యష్  ఓవర్ నైట్ ఇండియన్ సూపర్ స్టార్ అయ్యాడు. రాఖీ భాయ్ పాత్రలో వీర విహారం చేసి  ప్రేక్షకులు తన అప్ కమింగ్ సినిమాల గురించి వెయిట్ చేసే పరిస్థితిని కల్పించాడు. మరి ఇప్పుడు కేజిఎఫ్ 3(kgf 3)లో యష్ హీరో కాదనే వార్తలు వస్తున్నాయి. తమిళ సూపర్ స్టార్ అజిత్(ajith) ఆ ప్లేస్ లో జాయిన్ అయ్యాడని అంటున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అజిత్ ఫ్యాన్స్ అయితే అప్పుడే హంగామా కూడా స్టార్ట్ చేసారు. యష్ ఫ్యాన్స్ మాత్రం అదంతా అబద్ధం అని పార్ట్ 3 లో కూడా యష్ నే ఉంటాడని అంటున్నారు. ఏది ఏమైనా అధికార ప్రకటన వస్తే గాని అసలు విషయం తెలియదు. 

 పార్ట్  2 లో సముద్రంలో వెళ్తున్న రాఖీ భాయ్ మీద భారీ దాడి జరుగుతుంది. ఆ సమయంలో  రాఖీ బాయ్ సముద్రంలో పడిపోతాడు. ఇక్కడ నుంచే కేజిఎఫ్ 3 స్టార్ట్ కానుందని  ప్రశాంత్ నీల్(prashant)కథ రెడీ  చేసే పనిలో ఉన్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే  ప్రశాంత్   చేతిలో  సలార్ 2 ,ఎన్టీఆర్ మూవీలు ఉన్నాయి. కాకపోతే ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనే విషయంలో క్లారిటీ లేదు. అజిత్ మాత్రం ప్రెజంట్ గుడ్ అండ్ అగ్లీ  మూవీలో బిజీగా ఉన్నాడు.

 



Source link

Related posts

Jagan Mohan is a name and avatar for Lord Vishnu అయ్యా జగన్.. ఇది ఏంటయ్యా..

Oknews

ఎట్టకేలకు 'లీడర్-2'కి ముహూర్తం కుదిరింది..!

Oknews

Again Movie in Nani and Srikanth Odela Combo నాని-శ్రీకాంత్: దసరా కి సీక్వెల్ కాదా?

Oknews

Leave a Comment