Entertainment

కేరళలో విజయ్ కారు ధ్వంసం..చలించిపోయాడు


తలపతి విజయ్ కి తమిళనాడు లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేని ఇమేజ్ ఆయన సొంతం. 40 సంవత్సరాల తన సినీ కెరీర్ లో కొన్ని లక్షల మంది అభిమానులని  సంపాదించాడు. తాజాగా కేరళలో విజయ్ కి ఎదురైన ఒక సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

విజయ్ ప్రస్తుతం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే మూవీ చేస్తున్నాడు. కేరళలో షూటింగ్ ని ప్లాన్ చేసారు.అందులో భాగంగా    చెన్నై నుంచి  తిరువనంతపురం చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న కేరళ  విజయ్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ఎయిర్ పోర్ట్ కి  చేరుకున్నారు.పెద్ద ఎత్తున బైక్ లతో కారులతో ర్యాలీగా వెళ్ళడానికి ఫిక్స్ అయ్యారు. విజయ్ కారుని ఫాలో అవుతు వెళ్లాలనేది వాళ్ళ ప్లాన్. కానీ భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో విజయ్ కారులోనే ఉండిపోవాల్సొచ్చింది. అభిమానులు  కారు మీద కూడా పడటంతో ముందు వైపు వెనుకవైపు అద్దాలు పగిలిపోయాయి. కారుకి చాలా చోట్ల డామేజ్ కూడా  జరిగింది. అంత జరుగుతున్నా కూడా  విజయ్ వాళ్ళని ఏమి అనలేదు సరి కదా వాళ్ళ అభిమానానికి చలించి పోయాడు. వాటి తాలూకు పిక్స్ అన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. విజయ్ ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో ఉన్నంత సేపు   తలపతి  జిందాబాద్ అనే నినాదాలు తప్ప ఇంకేమి వినపడలేదు.ఆ తర్వాత అతి కష్టం మీద అక్కడనుంచి బయటపడ్డాడు.

ఇప్పుడు ఈ సంఘటనతో కేరళలో విజయ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రస్తుతం చర్చనీయాంశమయ్యింది. ఎందుకంటే  ఇటీవలే  ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. తమిళగ వెట్రి కజగం అనే పేరుతో ఒక కొత్త రాజకీయ పార్టీ ని స్థాపించాడు. పుట్టుకతో అందరు సమానమే,అందరకి న్యాయం జరగాలి అనే నినాదంతో  పార్టీని స్థాపించానని ఆయన తెలిపాడు.

 



Source link

Related posts

అందుకే బాలయ్యకు నో చెప్పా.. జనసేనలో చేరడంపై విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్స్!

Oknews

వైజాగ్ కోసం అన్ని కోట్లా.. మెగా హీరో ఏం చేస్తున్నాడు..?

Oknews

వెంకీ గురించి రవితేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Oknews

Leave a Comment