Top Stories

కేరాఫ్ బాలయ్య అల్లుడు కాదట…!


విశాఖకు చెందిన శ్రీభరత్ సినీ ప్రముఖుడు నందమూరి బాలక్రిష్ణ చిన్నల్లుడు. ఆయన బాలయ్య రెండవ కుమార్తెను వివాహం చేసుకున్నారు. బాలయ్య మాస్ హీరో. దాంతో పాటు రాజకీయంగా ఆ కుటుంబం ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించింది. దాంతో శ్రీభరత్ ని అంతా బాలయ్య చిన్నల్లుడు అనే ట్యాగ్ చేసి పిలుస్తున్నారు.

అయితే ఒక యూట్యూబ్ చానల్ కి తాజాగా ఇచ్చిన ఇంటర్యూలో శ్రీ భరత్ మాట్లాడుతూ తనకు ఎన్నో ట్యాగ్స్ ఉన్నా గీతం విద్యా సంస్థల చైర్మన్ ని అని అలా తనకు గుర్తింపు ఉండడమే ఎంతో ఆందం అని మనసులో మాట చెప్పరు. బాలయ్య అల్లుడిగా తనకు గుర్తింపు రావడం మంచిదే అని అలాగే నారా లోకేష్ తోడల్లుడిగా తనను చెబుతారని ఆ ఇద్దరితో తనకు అందమైన బంధం కుటుంబ బంధం కంటే కూడా ఎక్కువగా ఉందని శ్రీభరత్ చెప్పారు.

ఆ ఇద్దరూ తన శ్రేయస్సుని మనసారా కోరుకునేవారే అని అన్నారు. నారా లోకేష్ ని అయితే అన్నగా భావించి అన్ని విషయాలు పంచుకుంటాను అని శ్రీభరత్ ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తాను గీతం విద్యా సంస్థల చైర్మన్ గా తన వంతుగా స‌హ‌యం సమాజానికి చేస్తున్నానని ఆయన అన్నారు.

ఎంపీగా అయితే మరింతగా ప్రజలకు సేవ చేయగలను అన్నది తన ఆలోచన అని శ్రీభరత్ చెప్పారు. శ్రీభరత్ ఇద్దరు తాతలూ రాజకీయంగా కాకలు తిరిగిన యోధులే. విశాఖ నుంచి ఎంపీగా రెండు సార్లు గెలిచిన ఎంవీవీఎస్ మూర్తి తండ్రి తరఫున తండ్రి అలా ఒక వైపు తాత అయితే తల్లి తరఫున తండ్రిగా ఉన్నారు కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు. ఈ విధంగా ఇద్దరి తాతల రాజకీయ అనుభవాన్ని వారి వారసత్వాన్ని తీసుకుని విశాఖ నుంచి ఎంపీ కావాలని శ్రీభరత్ చూస్తున్నారు. పొత్తులలో టికెట్ వేరే పార్టీకి పోకుండా ఉంటే శ్రీభరత్ కి చాన్స్ దక్కుతుంది అని అంటున్నారు.



Source link

Related posts

ఆస్కార్ కోసం దిల్ రాజు ఏం చేయబోతున్నాడు..?

Oknews

వైసీపీలోకి మాజీ మంత్రి!

Oknews

మెగాస్టార్ చిరంజీవి యండమూరి కాంబోని కలిపిన విశాఖ!

Oknews

Leave a Comment