చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులుసీసీ కెమెరాల ద్వారా ఆ మహిళ ఎంజీబీఎస్(MGBS) బస్ స్టాండ్ కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ పరిశీలించగా పాపను ఎత్తుకెళ్లిన నుస్రత్ షాజహాన్ బేగం అక్కడ మహారాష్ట్ర బస్సు ఎక్కినట్లుగా గుర్తించారు. వెంటనే మాదన్నపేట పోలీసులు జహీరాబాద్ పోలీసులకు సమాచారం అందించి వారిని అప్రమత్తం చేశారు. పోలీసులు తనిఖీ చేస్తారనే అనుమానంతో మహిళ సదాశివపేటలో బస్సు దిగి అక్కడే ఉన్న కర్ణాటక బస్సు ఎక్కింది. అప్పటికే జహీరాబాద్ (Zaheerabad)పోలీసులు బస్టాండ్ ఎదుట నిలబడి వచ్చే ప్రతి కర్ణాటక, మహారాష్ట్ర బస్సులను తనిఖీ చేస్తున్నారు. శనివారం రాత్రి ఒంటిగంట సమయంలో బస్సు ఆగగానే పోలీసులను గమనించిన సదరు మహిళ పాపను తీసుకొని పారిపోయేందుకు ప్రయత్నించింది. అప్రమత్తమైన పోలీసులు ఆమెను పట్టుకొని విచారణ చేపట్టారు. వారు మాదన్నపేట పోలీసులకు, చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులకు కాల్ చేసి పాపను చూపించడంతో వారు తమ పాప సిద్ధిఖీగా గుర్తించారు. వెంటనే వారు జహీరాబాద్ చేరుకొవడంతో చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
Source link
previous post