KCR Election Campaign Schedule:
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ అనారోగ్యం నుంచి వేగంగా కోలుకుంటున్నారు. త్వరలోనే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనారోగ్యం నుంచి కోలుకుని ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యుల్ ను బీఆర్ఎస్ విడుదల చేసింది. అక్టోబర్ 15న హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. గజ్వేల్ లో మధ్యాహ్నం 1 – 2 గంటల మధ్య నామినేషన్, అదే రోజు మధ్యాహ్నం 2- 3 గంటలకు కామారెడ్డిలో నామినేషన్ వేసిన అనంతరం సాయంత్రం 4 గంటలకు కామారెడ్డిలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్ వివరాలివే..
అక్టోబర్ 15 – హుస్నాబాద్
అక్టోబర్ 16 – జనగాం, భువనగిరి
అక్టోబర్ 17 – సిరిసిల్ల, సిద్దిపేట
అక్టోబర్ 18 – జడ్చర్ల, మేడ్చల్
అక్టోబర్ 26 – అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడు
అక్టోబర్ 27 – పాలేరు, స్టేషన్ ఘన్‌పూర్
అక్టోబర్ 29 – కోదాడ, తుంగతుర్తి, ఆలేరు
అక్టోబర్ 30 – జుక్కల్, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్
అక్టోబర్ 31 – హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ
నవంబర్ 01 – సత్తుపల్లి, ఇల్లెందు
నవంబర్ 02 – నిర్మల్, బాల్కొండ, ధర్మపురి
నవంబర్ 03 – భైంసా(ముధోల్), ఆర్మూర్, కోరుట్ల
నవంబర్ 05 – కొత్తగూడెం, ఖమ్మం
నవంబర్ 06 – గద్వాల్, మఖ్తల్, నారాయణపేట
నవంబర్ 07 – చెన్నూరు, మంథని, పెద్దపల్లి
నవంబర్ 08 – సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి
నవంబర్ 09 – గజ్వేల్ లో మధ్యాహ్నం 1 – 2 గంటల మధ్య నామినేషన్
అదే రోజు మధ్యాహ్నం 2- 3 గంటలకు కామారెడ్డిలో నామినేషన్
సాయంత్రం 4 గంటలకు కామారెడ్డిలో కేసీఆర్ భారీ బహిరంగ సభ