హీరోయిన్లు ఎంతోమంది ఉన్నా కుర్రకారు హృదయాలను దోచుకునే బ్యూటీలు కొందరే ఉంటారు. అందులో ఇలియానా ఒకరు. తన అందచందాలతో యూత్‌ని ఎంతగానో అలరించిన ఆమె ఇప్పుడు సినిమాలకు దూరం ఉంటూ పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా బిజీగా ఉన్న టైమ్‌లోనే బాలీవుడ్‌కి వెళ్ళి అక్కడ వర్కవుట్ అవ్వక మళ్ళీ టాలీవుడ్‌కి వచ్చేసింది. దీంతో ఆమె కెరీర్ గాడి తప్పింది. ఇలియానాతో సినిమాలు చేసేందుకు హీరోలు, దర్శకనిర్మాతలు ముందుకు రాలేదు. దానికితోడు లవ్ ఎఫైర్, బ్రేకప్ వంటి విషయాలు ఆమెను వెనక్కి నెట్టేశాయి. ఇక సినిమా కెరీర్‌పై ఆశలు వదులుకున్న ఇలియానా తన పర్సనల్ లైఫ్‌పై దృష్టి పెట్టింది.
మైఖేల్ డోలన్ అనే వ్యక్తితో రిలేషన్ మెయిన్ టెయిన్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె తన ప్రెగ్నెసీ విషయాన్ని వెల్లడిరచింది. ఆగస్ట్ 1న మగ బిడ్డకు జన్మనిచ్చింది ఇలియానా. తాజాగా కొడుక్కి రెండు నెలలు పూర్తయిన సందర్భంగా కొడుకుని ఎత్తుకొని ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఫోనిక్స్ డోలన్ అని కొడుక్కి పేరు పెట్టింది. ఇలియానాకు ప్రెగ్నెన్సీ అని తెలిసి అందరూ షాక్ అయ్యారు. పెళ్ళి కాకుండానే పిల్లలు ఏమిటి అని ఆశ్చర్యపోయారు. చాలా కాలం తన బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయాన్ని వెల్లడిరచలేదు. ఆమెకు డెలివరీ అయిన తర్వాతే మైఖేల్ డోలన్‌ను అందరికీ పరిచయం చేసింది. అయితే వీరిద్దరూ పెళ్ళి చేసుకున్నారా లేక సహజీవనం చేస్తున్నారా అనే విషయాన్ని మాత్రం కన్‌ఫర్మ్ చెయ్యలేదు.