పట్టాలు తప్పిన ఇంజిన్, రెండు బోగీలు
ప్రాథమిక సమాచారం ప్రకారం విశాఖపట్నం నుంచి భవానీపట్న వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలు విజయనగరం జిల్లా కొత్తవలస వద్ద పట్టాలు తప్పింది. దీంతో రెండు బోగీలు ఒకవైపు, మరోవైపు రైలు ఇంజిన్ పక్కకు వాలాయి. రైలు కొత్తవలస రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన కొద్ది సమయానికే ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే రైలు నెమ్మదిగా నడపడం, లోకో పైలట్ అప్రమత్తంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ పనులు చేపట్టారు. 2023లో విజయనగరంలో విశాఖపట్నం-రాయగడ రైలు(Visakha Rayagada Train Accident), పలాస రైలు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు మరణించిన సంగతి తెలిసిందే.